
2019 లో 5 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి చేతిలో ఓటమి పాలైన లోకేష్ 2024 లో దాదాపు 90 వేల ఓట్ల పైచిలుక మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే మంగళగిరిలో తన గెలుపుకి తన పై నమ్మకం పెట్టి ఇచ్చిన మెజారిటీ కి అక్కడి ప్రజలకు పూర్తి న్యాయం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్.
మంగళగిరిలోని ఎకో పార్క్ ప్రవేశ రుసుమును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసారు నారా లోకేష్. ఇక నుంచి ఎవరైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పార్క్ లోకి ఎటువంటి ప్రవేశ రుసుము చెల్లించకుండా వెళ్లొచ్చని, వాకింగ్ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read – పోసాని కేసు: అత్యుత్సాహం వద్దు రాజా!
అయితే ఎన్నికల సమయంలో ఎకో పార్క్ ప్రవేశ రుసుము ను రద్దు చేయాలంటూ మంగళగిరి వాకర్స్ అస్సోసియేషన్ నుంచి తనకు అభ్యర్ధన వచ్చిందని, ఆ మేరకు వారికిచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకునేలా ఈ నిర్ణయం వెల్లడించినట్టు ప్రకటించారు లోకేష్.
అయితే అందుకు గాను పార్క్ ప్రవేశ రుసుమును తొలగించాలంటూ అటవీ శాఖ అధికారులను కోరగా అది రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పాలసీ కావడంతో రుసుము తొలగించడం సాధ్యం కాదని వెల్లడించారు అధికారులు.
Also Read – చంద్రబాబు-బిల్ గేట్స్: ఈ ఒక్క ఫోటో చాలు!
దానితో ఆ పార్క్ ప్రవేశ రుసుమును గాను ఏటా 5 లక్షల తన సొంత జేబులో డబ్బును తానూ రుసుము కింద చెల్లిస్తానంటూ అటవీ అధికారులకు తెలిచేసారు నారా లోకేష్. లోకేష్ చూపిన ఈ చొరవతో పార్క్ ప్రవేశ రుసుము భారం ప్రజల పై పడదు. తన నియోజకవర్గ అభివృద్ధిలోనూ, తన ప్రాంత ప్రజల సౌకర్యాలలోను లోకేష్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ కేవలం ప్రభుత్వ సొమ్ము మీదే ఆధారపడకుండా తన సొంత జేబులో డబ్బుని కూడా వెచ్చిస్తున్నారు.
గతంలో కూడా తన నియోజకవర్గ సుందరీకరణకు గాను తన సొంత డబ్బుతో 5 గడ్డి యంత్రాలను కొనుగోలు చేసి, అందుకు గాను 5 గురు కార్మికులను కూడా నియమించుకుని వారి జీతభత్యాలు కూడా తన బాధ్యతగా భావించి చెల్లిస్తున్నారు. అలాగే అనేకమంది చిరు వ్యాపారులకు వారి వ్యాపారానికి అవసరమైన తోపుడు బండ్లను, ఇతరత్రా సామాను అందిస్తూ మంగళగిరి ఓటర్లకు తమ ఓటుకు పూర్తి న్యాయం జరిగేలా చేస్తున్నారు లోకేష్.
Also Read – కొడాలి నాని అధ్యాయం ప్రారంభం!
ఇటువంటి సాయాలు లోకేష్ వంటి బడా రాజకీయ నాయకుల కుటుంబాలకు చిన్న విషయమే కావచ్చో కానీ స్థానిక ప్రజల దృష్టిలో ఇటువంటి చిన్న విషయాలే పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి, చూపిస్తున్నాయి కూడా. దానికి తోడు నిత్యం ప్రదర్బార్ నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు.