ఏపీ ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్‌తో సహా పలువురు మంత్రులు తమ తమ శాఖలని చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటున్నారు. అందువల్లే వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీరిక లేక మీడియాకు దూరంగా ఉంటున్నారు.
పని ఒత్తిడి వల్లనే పవన్ కళ్యాణ్ తాను మొదలుపెట్టిన మూడు సినిమాలు నేటికీ పూర్తి చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాలలో మొదలైన అభివృద్ధి పనులతో బిజీగా ఉంటున్నారు.
Also Read – మేము రోడ్లపై జగన్ ప్యాలస్‌లోనా.. ఎందుకు ?
ఓ ప్రభుత్వం పనిచేస్తే ఏవిదంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిరూపించబోతున్నారు.
అయితే జగన్ ప్రభుత్వం పనిచేసే విధానం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని అందరికీ తెలుసు. జగన్ మంత్రివర్గంలో ఒకరిద్దరు తప్ప మిగిలినవారందరూ డమ్మీ మంత్రులే. అన్ని శాఖలను జగనే సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు.. ఆయనే నిర్ణయాలు తీసుకునేవారు. తమ ప్రమేయమే ఉండేది కాదని అత్యంత కీలకమైన విద్యుత్ శాఖకు మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే చెప్పారు.
Also Read – ఈవీఎంలా.. వాస్తు దోషాలా.. ఏవి దెబ్బేశాయబ్బా?
జగన్ పంపించే ఫైల్స్‌పై సంతకాలు చేయడం తప్ప తాము మరేమీ చేయవలసిన అవసరం ఉండేది కాదని బాలినేని చెప్పారు. అది వాస్తవం కూడా.
మంత్రులుగా పనిచేసిన రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, సీదిరి అప్పలరాజు వంటివారు తమ శాఖల గురించి ఏం మాట్లాడలో తెలియకనే తమ అధినేత సూచన మేరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ నేతలని అవహేళన చేస్తూ కాలక్షేపం చేసేవారు.
Also Read – విదేశాలకు రేషన్ బియ్యం రవాణా ఏవిదంగా అంటే..
అటువంటివారు ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని, మంత్రులను, వారి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా?
కోడి-గుడ్డు కధ తప్ప మరేమీ తెలీని మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేడు విశాఖలో కాసేపు జగన్ భజన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆరు నెలలలోనే 60 వేల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారని విమర్శించారు.
మెగా డీఎస్సీ లేదు.. హామీల అమలు లేదు.. అభివృద్ధి, సంక్షేమ పధకాలు అన్నీ నిలిచిపోయాయని అమర్నాధ్ విమర్శించారు. అదే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే సంక్షేమ పధకాలన్నీ యధాతధంగా అమలవుతుండేవని, చంద్రబాబు నాయుడు వచ్చి అన్నిటినీ నిర్వీర్యం చేసేశారని గుడివాడ అమరనాథ్ విమర్శించారు.
అయితే మాజీ మంత్రిగా రాష్ట్రానికి తాను ఎంత పెట్టుబడులు తీసుకువచ్చారో.. ఎన్ని పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటు చేయించారో వివరాలు చెప్పలేరు. కానీ విమర్శించడం తేలిక కనుక విమర్శిస్తున్నారని సరిపెట్టుకోవాలేమో?