ఈ నెల 27న నగిరిలో ఇసుక క్యారీ లారీ ఢీకొని మహిళ మృతి చెందడంతో దానికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ ఎమ్మెల్యేపై అభియోగం మోపి స్థానిక పోలీసులు కేసు పెట్టారు. నగిరి సీఐ టీడీపీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని వైకాపా వారు విమర్శించారు.
[m9ad]
అయితే ఆ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సదరు వీడియోలో నగరి సిఐను లం***కా అని దూషించి… లక్షలక్షలు దెం**డు అని రోజా ఆరోపించడం స్పష్టంగా కనిపించింది వినిపించింది. ఒక ఎమ్మెల్యే ప్రజాక్షేత్రంలో ఒక ప్రభుత్వ అధికారిని దూషించడం హేయమైన చర్య అనే అనాలి.
మొదటి నుండి రోజా వ్యవహారశైలి వివాదాస్పదమే. అయితే చేసిందంతా చేసి ఇప్పుడు ప్రజాసమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నాయకులపై టీడీపీ ప్రభుత్వం అక్రమకేసులు పెడుతుందని ఆవిడ ఆరోపిస్తున్నారు. కేసులకు భయపడే పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తానని ఆమె తెలిపారు.
MLA Roja Garu is this the way you speak in public ?
This is how YCP MLA candidate are been selected for elections #YCP #jagan #roja @ysjagan @Troll_Tollywood @YSRCParty @YSRCPDMO @JaiTDP pic.twitter.com/hAh6lYXhm3
— KIRAN GUDIVADA ROGUE. (@Legendtarak9999) July 31, 2018



