వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఇంగ్లీష్ భాషను ఎంత మందికి అందుబాటులోకి తెచ్చారో తెలియదు కానీ బూతుల సంస్కృతిని మాత్రం గడప గడపకు తీసుకెళ్తున్నారు. రాజకీయాలలో ఇటువంటి భాషా వెసులుబాటును కల్పించిన జగన్ గారికి మాత్రం వైసీపీ నాయకులంతా ధన్యవాదాలు చెప్పక తప్పదు.
ముఖ్యమంత్రి గారు గడప గడకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని.., ప్రభుత్వ పధకాలను ప్రచారం చేసి రమ్మని ఆపార్టీ నేతలకు ఆదేశాలిస్తే ఆ నాయకులు మాత్రం గడప గడపలో ప్రశ్నించిన వారిని బెదిరించడం., బూతులు తిట్టడం., వారి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడం వంటి కార్యక్రమాలలో బిజీగా ఉంటు ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని రాజకీయ నాయకుల కాలర్ పట్టుకుని నిలదీసే రోజు రాజకీయ వ్యవస్థలో రావాలని అప్పుడే రాజకీయాలలో పారదర్శకత వస్తుందని ఎన్నికల ముందు జగన్ ప్రజలకు చెప్పిన వ్యాఖ్యలివి.
ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని ఆ వ్యాఖ్యలు చేశారో లేక వైసీపీ అధికారంలోకి రాదనుకొని చేశారో తెలియదు కానీ ఇప్పడు ఆ వ్యాఖ్యలనే ప్రజలు అనుసరిస్తుంటే మాత్రం ఓపార్టీ పెద్దలుకానీ.., పార్టీ నేతలు కానీ.., కార్యకర్తలు కానీ తట్టుకోలేకపోవడం ఇక్కడ కొసమెరుపు.తాజాగా మోపిదేవి మండలం పెద్దప్రోలు గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ని నిలదీశారు అక్కడి యువకుడు.
ప్రభుత్వ విద్యాదీవెన పధకం క్రింద 80వేల రూపాయలు రాకపోవడం వలన తన చదువుకి ఆటంకం కలిగిందంటూ సదరు యువకుడు ఎమ్మెల్యే సింహాద్రిని నిలదీయడంతో ఆగ్రహించిన ఆ వైసీపీ నేత తానూ ఒక ప్రజాప్రతినిధిని అనేవిషయం మరిచి ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు. అయితే సదరు వ్యక్తి కూడా భయపడకుండా తనకు జరిగిన అన్యాయం పై ఎమ్మెల్యే ను ప్రశ్నించారు.
ఓట్లు అడగడానికి వచ్చిన ప్పుడు లేవని నోరు ప్రశించేటప్పుడు లేగుస్తుందేంటి సార్…. అంటూ అప్పుడేమో కాళ్ళమీద పడతారు.., ఇప్పుడేమో కాలర్ పట్టుకుంటారు అంటూ ఆ యువకుడు రివర్స్ ఎటాక్ చేయడంతో చేసేదేమి లేక తన అసహనాన్ని బూతుల రూపంలో వెళ్లబుచ్చి అక్కడినుండి వెళ్లిపోయారు. మాకు సమాధానం కావాలంటూ ఆయువకుడు అడగగా ఎవడ్రా నువ్వు.., నీకు నేను సమాధానం చెప్పడం ఏంటి..? అపవాయ్…ఏమమాట్లాడుతున్నావ్…,అంటూ వీడియో రికార్డు చేస్తున్న విలేకరిని ఉద్దేశించి వాడి ఫోన్ పారదొబ్బండి అంటూ రెచ్చిపోయారు సదరు ఎమ్మెల్యే.
ప్రజా ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక లేనప్పుడు ప్రజా యాత్రలంటూ గడప గడపకు తిరగడం ఎందుకు..? ప్రజలను బూతులు తిట్టడం ఎందుకు..? దీనివలన వైసీపీ పార్టీకి గాని.., ఆపార్టీ నేతలకు గాని ఎటువంటి మేలు జరుగుతుందో ఆపార్టీ పెద్దలే పునః పరిశీలించుకోవాలనేది రాజకీయ విశ్లేషకుల మాట.
ఎన్నికల ముందు గెలుపే లక్ష్యంగా చేయలేని హామీలిచ్చి ఇప్పుడు చేతకాక చేతులెత్తేసి ప్రజల పై పడితే ఎలా సారూ అంటూ నేటి యువత తమ గళం విప్పుతున్నారు. ఇకనైనా రాజకీయ పార్టీలు ప్రజలకిచ్చే హామీల పట్ల కొంత అధ్యయనం చేసి…అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని ఆశిద్దాం.



