ysrcp-bjp MLC Candidates

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ల పంచాయితీలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇటు ఏపీలో 5 స్థానాలకు గాను టీడీపీ మూడు, జనసేన, బీజేపీ చెరో ఒకటి దక్కించుకున్నాయి. అలాగే ఇటు తెలంగాణలోనూ అదే ఐదు స్థానాలకు గాను కాంగ్రెస్ మూడు, సిపిఐ ఒకటి, బిఆర్ఎస్ ఒక స్థానం లో తమ అభ్యర్థులను ఖరారు చేసారు.

అలాగే ఎమ్మెల్సీ లు దక్కించుకున్న రెండు రాష్ట్రాల రాజకీయ నేతలు తమ తమ నామినేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్నోఏళ్ల నిరీక్షణ తరువాత కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఢిల్లీ పర్యటనలు, అధిష్టానంతో మంతనాలు ఫలించి ఎట్టకేలకు రాములమ్మ రాజకీయంగా ఒక మెట్టు పైకెదిగారు.

Also Read – అందగాళ్ళ అరెస్టులు…సౌమ్యుల రాజీనామాలు..!

అలాగే కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు అవకాశం దక్కింది. ఇక కాంగ్రెస్ తో పొత్తు కారణంగా సిపిఐ పార్టీ నుంచి నెల్లికంటి సత్యం కు అవకాశం దక్కింది. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బిఆర్ఎస్ కూడా తమ పార్టీ కోటా కింద దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేసింది. ఏపీలో కూటమి పార్టీల మధ్యే సాగిన ఈ ఎమ్మెల్సీ ల పంచాయితీ తెలంగాణలో మాత్రం అధికార, విపక్షాల మధ్య సాగాయి.

అయితే ఏపీలో కూటమి పొత్తులో భాగంగా ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ తెలంగాణలో మాత్రం ఖాళీ చేతులతో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఏపీలో 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వైసీపీ, తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ రెండు కూడా ఒకే మాదిరి ఎమ్మెల్సీ లకు అవసరమైన బలం లేకపోవడంతో సైలెంట్ అయ్యాయి.

Also Read – చంద్రబాబు-బిల్ గేట్స్: ఈ ఒక్క ఫోటో చాలు!


ఏపీలో కూటమి పొత్తుతో తనకు లేని బలం కూడా ప్రదర్శిస్తున్న బీజేపీ తెలంగాణలో మాత్రం తన సొంత బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే వైసీపీ మాత్రం తన మూర్కపు రాజకీయాలతో, నియంత పోకడలతో తనకున్న బలాన్ని కూడా చేతులారా చేజార్చుకుని బీజేపీ స్థాయి కన్నా దిగువ స్థానానికి చేరింది. ఇలా ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీజేపీ రెండు కూడా బలప్రదర్శనకు అవసరమైన బలం లేక మున్నకుండిపోయాయి.