Somu Veerraju

మాజీ ఏపీ బీజేపి అధ్యక్షుడు సోమూ వీర్రాజుకి టీడీపీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంపై టీడీపీలో నేతలు, కార్యకర్తలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు కూడా తప్పు పడుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వంలో బీజేపి భాగస్వామిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోమూ వీర్రాజు చంద్రబాబు నాయుడుపై అనుచిత విమర్శలు చేస్తుండేవారు.

Also Read – పోసాని కేసు: అత్యుత్సాహం వద్దు రాజా!

అదే సమయంలో వైసీపీ అధినేత జగన్‌కు అనుకూలంగా రాజకీయాలు చేస్తూ, ఏపీలో బీజేపిని భ్రష్టు పట్టించేశారు. ఆయన స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బీజేపి అధ్యక్షురాలుగా నియమించడానికి, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఆయనకు టికెట్ నిరాకరించడానికి ఇవన్నీ కారణాలే అని అందరికీ తెలుసు.

జగన్‌లాగే తననోటి దురుసుతనంతో సొంత పార్టీని నష్టపరుచుకున్న సోమూ వీర్రాజుకి ఎమ్మెల్సీ టికెట్ లభించడం అదీ.. టీడీపీలో ఎంతో మంది సీనియర్స్ ఉండగా వారందరినీ కాదని సోమూకి టీడీపీ ఎమ్మెల్యేల కోటాలో టికెట్ కేటాయించడాన్ని టీడీపీ మద్దతుదారులు జీర్ణించుకోలేరు. అందుకే ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read – అందగాళ్ళ అరెస్టులు…సౌమ్యుల రాజీనామాలు..!

దీనిపై సిఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే “ఆయనకు టికెట్ ఇవ్వాలని బీజేపి పెద్దలు కోరారు కనుకనే ఇచ్చామని (ఇవ్వక తప్పలేదని) స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరం కనుక ఢిల్లీ పెద్దల మాటని సిఎం చంద్రబాబు నాయుడుని కాదనలేకపోయారు. కనుక ఆయన నిందించడం సరికాదు. కానీ ఈ ఎమ్మెల్సీ సీటు కోసం సోమూ వీర్రాజు ఢిల్లీలో చక్రం తిప్పారని అర్దమవుతూనే ఉంది.

ఈ విమర్శలపై సోమూ వీర్రాజు కూడా స్పందిస్తూ, “నేను ఎన్నడూ సిఎం చంద్రబాబు నాయుడు గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆయనని వ్యతిరేకంగా పనిచేయలేదు. జగన్‌తో రహస్యంగా చేతులు కలపలేదు.

Also Read – 17 ఏళ్ళ పోరు…ప్రతీకారం తీర్చుకుంటారా.?

నిజానికి 2014 ప్రభుత్వంలోనే సిఎం చంద్రబాబు నాయుడు నాకు మంత్రి పదవి ఇస్తానంటే నిరాకరించాను. ఇప్పుడు కూడా మా పెద్దల సూచన మేరకే ఈ పదవి స్వీకరిస్తున్నాను,” అని సమర్ధించుకున్నారు.

నాడు మంత్రి పదవిని తిరస్కరించానని చెప్పుకుంటున్న సోమూ వీర్రాజు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేసి సంపాదించుకోవడం గమనిస్తే ఆయన అబద్దమాడుతున్నారని స్పష్టమవుతోంది కదా?




ఏది ఏమైనప్పటికీ, చంద్రబాబు నాయుడు వైఖరి బొత్తిగా నచ్చని, జగన్‌కు అనుకూలంగా వ్యవహరించే సోమూవీర్రాజుని, తప్పనిసరి పరిస్థితిలో తెచ్చి పక్కన పెట్టుకోవడం కూటమి ప్రభుత్వానికి ప్రమాదకరమే. కనుక ఇకపై మరింత అప్రమత్తంగా ఉండడటం చాలా అవసరం.