వందల కోట్లతో ప్యాలస్‌లు నిర్మించుకున్నారు కానీ..

Money Spent For Palaces but Not Aqua Park

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో లక్షల కోట్లు అప్పులు చేశారు. సంక్షేమ పధకాల పేరుతో ఆ డబ్బుని ప్రజలకు పంచి ఓట్లు దండుకోవాలనుకున్నారు.

కానీ లక్షల కోట్లు పంచిపెట్టినా ఎన్నికలలో వైసీపీ గెలవలేకపోయింది. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు, వాటి వడ్డీలు మిగిలిపోయాయి. ఆ సొమ్ము పండుగలకు, పబ్బాల ఖర్చులకేనని బొత్స సత్యనారాయణ వంటి వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు కూడా. అంటే అంతా వృధా అన్నమాట!

ADVERTISEMENT

అన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్‌ రూ.5-600 కోట్లతో ఋషికొండపై తన కోసం విలాస వంతమైన ప్యాలస్‌లు కూడా నిర్మించుకున్నారు. కానీ రాష్ట్రంలో ఆక్వా పార్క్ ఏర్పాటు కోసం కేవలం రూ.35.23 కోట్లు కేటాయించడానికి మనస్కరించలేదు.

దేశంలో ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి. కనుక నాణ్యమైన చేపలు, రొయ్యలు, పీతల ఉత్పత్తికి అవసరమైన విత్తనాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమలు ఉన్న రాష్ట్రాలలో ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తోంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి.

జగన్‌ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత అంటే 2022-2023లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆక్వా పార్క్ మంజూరు చేసింది.

దాని కోసం కేంద్రం వాటాగా రూ.52.85 కోట్లు కేటాయించింది. జగన్‌ ప్రభుత్వం మరో రూ.35.23 కోట్లు కేటాయిస్తే చాలు.. ఆక్వా పార్క్ ఏర్పాటు అయ్యేది. ఆక్వా పరిశ్రమకు మరింత నాణ్యమైన విత్తనాలు లభించేవి.

కానీ జగన్‌ అప్పటికే సంక్షేమ పధకాల మోజులో కొట్టుకుపోతున్నారు. కనుక వాటిని సమర్ధంగా అమలుచేస్తే చాలు రాష్ట్రానికి మరేమీ అవసరం లేదనే అపోహలో ఉండేవారు. చివరి నిమిషం వరకు తాను అదే భ్రమలో ఉంటూ పార్టీలో నాయకులను, ప్రజలను కూడా సంక్షేమ పధకాలతోనే అభివృద్ధి సాధ్యం.. వాటితోనే తాము 175/175 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటామని నమ్మబలుకుతుండేవారు. ఆవిదంగా ఆక్వా పార్కు ప్రతిపాదనని పక్కన పడేశారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టగానే ఆక్వా పార్క్ ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలుపెట్టి మళ్ళీ రాష్ట్రానికి సాధించుకున్నారు.

బాపట్ల జిల్లా దిండి పరిశావారి పాలెంలో దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 192.40 ఎకరాలు కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.35.23 కోట్లు మంజూరు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూర్చి నిధులు విడుదల చేయడంతో ఆక్వా పార్క్ ఏర్పాటుకి చకచకా పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవ తీసుకొని డీపీఆర్ తయారుచేయించి ఢిల్లీలోని మారిటైం బోర్డుకి పంపగా దానిని ఆమోదించింది. త్వరలో ఆక్వా పార్క్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

ఈ ఆక్వా పార్కులో చేపలు, రొయ్యలు, పీతల విత్తనాలు ఉత్పత్తి జరుగుతుంది. వాటి ప్రాసెసింగ్, పరిశోధన యూనిట్, కోల్డ్ స్టోరేజ్, గోదాములు, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వగైరా ఏర్పాటు చేస్తారు.

ADVERTISEMENT
Latest Stories