మంచు విష్ణు తన తొలి క్రాస్ఓవర్ చిత్రం మోసగాళ్లు షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్నాడు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం జూన్ 5 న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడింది.
మోసగాళ్లు కథ 2700 కోట్ల విలువైన అతిపెద్ద ఐటి స్కామ్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది, ఇది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను కుదిపేసింది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అయితే ఆమె సినిమాలో విష్ణుకి సోదరిగా కనిపించడం విశేషం. దీనిని ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా నిర్మాతలు ధ్రువీకరించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ లో కాజల్ బైక్ మీద కూర్చుని ఉండటంతో సినిమాలో ఆమె రెబెల్ క్యారెక్టర్ లో కనిపిస్తుందా అని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం కుకట్‌పల్లిలో భారీ కార్పొరేట్ కార్యాలయాన్ని సెట్ గా నిర్మించారు, దీని కోసం 3.5 కోట్లు ఖర్చుపెట్టారట. ఈ సెట్‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది, అయితే ఈ సెట్ ఇప్పుడు ఖాళీగా పడివుంది.
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఒకేసారి రూపొందిస్తున్నారు. తెలుగు వెర్షన్లో పాటలు, ఫైట్లు వంటి మసాలా ఐటమ్స్ ఉంటాయి. మరోవైపు ఇంగ్లీష్ వెర్షన్ ను మొదటిగా ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్ లో సినిమాని ప్రదర్శించాలని విష్ణు అనుకుంటున్నాడట.





