
సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల హడావుడి తరువాత ఫిబ్రవరి 7 న విడుదలైన నాగ చైతన్య తండేల్ టాలీవుడ్ కి ఒక మంచి విజయాన్ని అందించింది.
ఇక ఆ తరువాత వరుసలో ఫిబ్రవరి నెలలలో వచ్చిన తెలుగు చిన్న సినిమాలు అంతగా రాణించలేదు. విశ్వక్ లైలా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తే, ఇక బ్రహ్మ ఆనందం, శబ్దం, మజాకా వంటి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సౌండ్ చేయలేకపోయాయి.
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
ఇక మార్చి నెలలో టాలీవుడ్ చిన్న సినిమాల్ని థియేటర్లలో దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యాయి. మొదటగా ఈ నెల 7 వ తేదీన ఛావా హిందీ డబ్బింగ్ మూవీ తెలుగు వర్షన్ విడుదల చేయనుంది గీతా ఆర్ట్స్. గత నెల 7 న తండేల్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన గీతా ఆర్ట్స్ ఈ నెల 7 ఛావా తో తెలుగు ఆడియెన్స్ ను పలకరిస్తూ మార్చి ఖాతాను తెరవనున్నారు.
ఇక ఆ తరువాత 14 న కిరణ్ అబ్బవరం…దిల్ రూబా, 28 న నితిన్, శ్రీలీల రాబిన్ హుడ్, 29 న MAD స్క్వేర్ విడుదల కానున్నాయి. అయితే వీటితో పాటుగా ఎన్నో రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ కూడాఈ నెల 28 న విడుదల కావాల్సి ఉంది.
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?
అయితే ఎప్పటిలాగే హరిహర వీరమల్లు మరో సారి వాయిదా పడడం ఖాయం అనే అభిప్రాయానికి వచ్చేసారు పవన్ అభిమానులు. ఇక ఇటు తెలుగు మూవీ తో పాటుగా కొన్ని అనువాద చిత్రాలు కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద మార్చి నెలలో దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
దీనితో క్రికెట్ లో ఐపిల్ మాదిరి మ్యాచ్ వెనుక మ్యాచ్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక సినిమా తరువత మరో సినిమా అంటూ వరుసపెట్టి థియేటర్లలో బొమ్మలు మారడానికి సిదంగా ఉన్నాయి. అయితే వీటిలో ఛావా ఇప్పటికే హిందీ వర్షన్ లో ఈ ఏడాదిలో బిగెస్ట్ హిట్ గా నిలిచింది.
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!
అలాగే ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఛావా మూవీ మీద ఆసక్తిగా ఉండడంతో ఈ మూవీ కి పాజిటివ్ బజ్ ఉంది. ఇక ‘క’ ఇచ్చిన సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న కిరణ్ అబ్బవరం కూడా దిల్ రుబా మూవీ మీద చాల కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్ గా మంచి హిట్ అందుకున్న MAD కి సీక్వెల్ గా వస్తున్న MAD స్క్వేర్ పట్ల కూడా ఒక పాజిటివ్ వైబ్ కనపడుతుంది.
ఇక భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ఆ తరువాత విజయం అన్న మాటకు దూరంగా ప్రయాణిస్తున్నారు. దీనితో ఈ నెల 28 న రాబోతున్న రాబిన్ హుడ్ మూవీ నితిన్ కెరీర్ కు అత్యంత కీలకం కానుంది. ఇలా మార్చి నెలలో టాలీవుడ్ లో మూవీ ఐపిల్ జరగనుంది. దీనిలో ప్రేక్షకుల మెప్పు పొంది థియేటర్లలో సత్తా చాటి సక్సెస్ అనే ఫైనల్ కప్ అందుకునే విజేతలెవరు..?