Ram Gopal Varma Non Bailable Warrant

శివ సినిమా తో టాలీవుడ్ లో నయా ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడిగా మారిన ఆర్జీవీ, సర్కార్, రంగీల, సత్య సినిమాలతో అటు బాలీవుడ్ లో కూడా తన హవ కొనసాగించి అప్పట్లోనే పాన్ ఇండియా దర్శకుడిగా ఖ్యాతి గడించారు.

అయితే కాలం గడిచే కొద్దీ ఆర్జీవీ సినిమాలు తన స్థాయిని తగ్గించుకుంటూ వచ్చి బ్లూ రేటెడ్ మూవీస్ గా ప్రేక్షకుల నుంచి తిరస్కరణను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాలతో వివాదాలను మాత్రమే ప్రమోట్ చేస్తున్న ఆర్జీవీ ఇటు ఏపీ రాజకీయలలోను వ్యూహం, శపథం, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, పవర్ స్టార్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కెమెరాలు పెట్టి భంగ పడ్డారు.

Also Read – తండేల్ కాంబోస్..!

అయితే గతంలో వర్మ చేసిన పాపాలు ఇప్పటికి పరిహారం దిశగా అడుగులు వేసాయి అనేలా 2018 లో నమోదైన చెక్ బౌన్స్ కేసు లో ముంబై అంధేరి కోర్ట్ అర్జీవిని దోషిగా తెలుస్తూ 3 నెలలు జైలు శిక్ష విధించింది. ఈ విషయంలో మహేష్ వర్మ అనే వ్యక్తి వర్మకు వ్యతిరేకంగా ముంబై కోర్టులో కేసు దాఖలు చేయగా అప్పటి నుంచి ఒక్కసారి కూడా వర్మ కోర్ట్ కు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం వర్మ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

అలాగే సదరు బాధితుడికి 3 నెలల్లో 3 .72 లక్షల పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో రామ్ గోపాల్ వర్మ మరో మూడు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలంటూ కోర్ట్ సంచలన తీర్పు ప్రకటించింది. దీనితో వర్మ పాపాలు పాన్ ఇండియా స్థాయిలో కోర్టులలో నలుగుతున్నాయా అంటూ సోషల్ మీడియాలో వర్మ మీద కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?

అయితే తన మీద ముంబై అంధేరి కోర్ట్ ఇచ్చిన తీర్పు పై స్పందించిన ఆర్జీవీ ఈ విషయంలో తన తరపున తన న్యాయవాది కోర్టుకు హాజరవుతున్నారని, ఇప్పుడు తన పై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల తన న్యాయవాదితో సంప్రదించి స్పందిస్తానంటూ తప్పుకున్నారు.




ఇదిలా ఉంటే ఏపీ పోలీసులు చెయ్యలేని పనిని కనీసం ముంబై పోలీసులైన చేయాలంటూ ఆర్జీవి తానూ చేసిన పాపాల నేపథ్యంలో జైలుకు పంపాల్సిందే అంటూ, ఆర్జీవీ జాలి జీవితం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు టీడీపీ, జనసేన అభిమానులు. మరి ఆర్జీవీ పాన్ ఇండియా పాపాల పొద్దు ఇక్కడితో ముగుస్తోందా లేక మరిన్ని బయటకువస్తాయా అనేది చూడాలి.

Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!