సినిమా హాల్ కార్మికుడి ఖాతాలో 400 కోట్ల బ్లాక్ మనీ!

Cinema Hall Worker Hawala, Ulhasnagar Cinema Hall Worker Hawala, Ulhasnagar Cinema Hall Worker DRI, DRI Unearths Ulhasnagar Cinema Hall Worker Hawala Scam ఒక సినిమా హాలులో పని చేసే కార్మికుడి వద్ద ఎంత మొత్తం ఉంటుంది? అలాగే ఓ పానీ పూరి అమ్ముకునే వ్యక్తి వద్ద షుమారుగా ఎంత మొత్తం ఉండవచ్చు? జాగ్రత్తపరులు అయితే బహుశా వేలల్లో ఉండవచ్చు. కానీ, వీరు ఖాతాలలో కోట్ల రూపాయల సొమ్ము వెలుగు చూసింది. అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఆ కోట్లు ఉన్న సంగతి వారికి కూడా తెలియకపోవడమే. నల్లధనం తరలించే ప్రముఖులు ఇలా సామాన్యులను అడ్డుపెట్టుకుని దాదాపు 1000 కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారు.

ఈ స్కాంలో షుమారుగా 2 వేల కోట్లకు పైగా మొత్తాన్ని దేశం బయటకు పంపించిన భారీ కుంభకోణాన్ని ముంబై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు కనిపెట్టారు. నాలుగు జాతీయ బ్యాంకులు, ఓ ప్రైవేటు బ్యాంకుకు సంబంధమున్న ఈ స్కాం దక్షిణ ముంబై నుంచి ఆరు బ్యాంకు శాఖల్లో జరిగింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య పలువురి ఖాతాల నుంచి విదేశాలకు నిధులు మళ్లాయి. అనామకుల పేరిట ఖాతాలు తెరచిన బడాబాబులు, వారికి ఎంతమాత్రమూ తెలియకుండానే డబ్బును దేశం దాటించారు.

ADVERTISEMENT

ఇందులో సినిమా హాలులో పని చేసే ఓ కార్మికుడి పేరిట ఉన్న ఖాతా నుంచి 400 కోట్లు, అలానే రైల్వే స్వీపర్, టికెట్ కలెక్టర్, పానీపూరీలు అమ్మే వ్యక్తుల పేరిట ఉన్న ఖాతాల ద్వారా 400 నుంచి 600 కోట్ల వరకూ ఫారిన్ ఖాతాలకు పంపారు. ఓ బోగస్ కంపెనీని స్థాపించడం, లావాదేవీ పూర్తి కాగానే వాటిని మూసివేయడం అక్రమార్కుల పనని డీఆర్ఐ అధికారి వివరించారు. ఒకే కంపెనీ ఈ స్కాంకు సూత్రధారని, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి సరుకులు ఇంపోర్ట్ చేసుకున్నట్టు చూపారని, 25 కోట్ల ఖరీదు చేసే సరుకులు తెచ్చి, వందల కోట్ల రూపాయలను పంపుతున్నా బ్యాంకులు పట్టించుకోలేదని ఆరోపించారు.

ADVERTISEMENT
Latest Stories