mumbai-vs-rcb-ipl-2025

ఇప్పటికే ఐపీఎల్ 18 సీజన్ మొదలయ్యి ప్రతి జట్టు మూడేసి మ్యాచ్లు కూడా ఆడేశారు. అయితే, 19 మ్యాచ్లు ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు టాప్ ప్లేస్ లో ఉండగా, ఈ ఏడు ఫెవరెట్స్ గా బరిలోకి దిగిన హైదరాబాద్,ముంబై, చెన్నై అట్టడుగున నిలిచాయి. ఈ సీజన్ లో నేడు జరగబోతున్న 20 వ మ్యాచ్ లో ముంబై జట్టు బెంగళూరు తో తలపడనుంది.

ముంబై వేదికగా ఆడనున్న ఈ మ్యాచ్ పై అభిమానుల అంచనాలు మాములుగా లేవు. గాయం తో ఇబ్బంది పడుతున్న బుమ్రా కూడా ఈ మ్యాచ్ తో కమ్-బ్యాక్ చేయనున్నాడని ముంబై జట్టు కోచ్ వెల్లడించారు. అయితే ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ కోహ్లీ, బెస్ట్ బౌలర్ బుమ్రా ను ఎదురుకోనున్నాడు. ఇలాంటి చిత్రాలను మనం సంవత్సరానికి కేవలం ఒక్కసారే అది ఐపీఎల్ లో మాత్రమే చూడగలం.

Also Read – గౌతమ్ కు బెదిరింపులు…

అయితే, బుమ్రా రాక ముంబై జట్టు లో తగ్గిన ఆ హుషారు ను కచ్చితంగా నింపనుంది. కోల్కతా పై గెలిచి ఫామ్ లో కి ఒచ్చేసారులే అనుకునే లోపే లక్నో పై చేతులెత్తేసింది ముంబై. ఆ జట్టు బ్యాటింగే వారికి పెద్ద తలనొప్పి గా మారింది. బడా బ్యాటర్లు ఉన్నప్పటికీ ముంబై కు బ్యాటింగ్ లో కష్టాలు తప్పట్లేదు.

ప్రస్తుత జట్టు ఫామ్ బాగోలేనప్పటికీ, ముంబై ను అసలు తక్కువ అంచనా వేయలేము. బుమ్రా, రోహిత్, పాండ్య, సూర్య, బోల్ట్ వంటి మహా-మహులున్న జట్టు అది. ఇటు పక్క ఆర్.సి.బీ జట్టు ను చూస్కుంటే, 3 మ్యాచ్ లలో 2 ఘన విజయాలు పొందినప్పటికీ గుజరాత్ చేతిలో మట్టికరిసారు. గత కొంత కాలంగా చూస్కుంటే బెంగళూరు జట్టుకు సొంత గ్రౌండ్ లో మంచి ఫలితాలు రావట్లేదు.

Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?

కానీ, ఇప్పడు చూస్కుంటే మ్యాచ్ జరగనున్న ముంబై లో కూడా వారు గత 10 ఏళ్లుగా తడపడుతూనే ఉన్నారు. ఎప్పడో 2015 లో ఏ.బీ.డీ మరియు కోహ్లీ మెరుపుల వలన ఆర్.సి.బీ జట్టు చివరిగా ఈ గ్రౌండ్ లో విజయం సాధించారు. ఆ తరువాత ఆడిన 6 మ్యాచ్ లలోను ఈ జట్టు ఓటమి పాలయి, వరుసగా గత 10 ఏళ్లు ఈ గ్రౌండ్ లో విజయం అనేదే లేకుండా ఒక చెత్త రికార్డు నమోదు చేసుకున్నారు.




అయితే, మొన్నటిదాకా చెన్నై చెపాక్ లో కూడా RCB ఈ తరహా రికార్డు ను బ్రేక్ చేసి ఆర్సీబీ ఫాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు. ఈ జట్టు చెపాక్ స్టేడియం లో గెలిచి 17 ఏళ్లయింది అని ట్రోల్ చేసేవారికి, ఈ ఏడాది చెన్నై తో చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో అదిరిపోయే విజయం సొంతం చేసుకుని తమ పై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు కెప్టెన్ రజత్. మరి ఈ కొత్త సారధి నేతృత్వం లో నే 10 ఏళ్ళ ముంబై శాపానికి కూడా ఆర్.సి.బీ చెక్ పెడుతుందా..?

Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..