టీడీపీలో ఉన్న ఇంటి దొంగను పట్టుకోవడానికి బాబు గేలం!

Murali Mohan Weight Loss comments irks Chandrababu Naiduటిడిపి ఎమ్.పిలకు సంబందించి బయటకు వచ్చిన వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఎమ్.పిలు ఇలా మాట్లాడి పార్లిని ఇబ్బంది పెడతారా అని సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే జరిగిన డామేజ్ కంటే మరో విషయం చంద్రబాబును పట్టి పీడిస్తుందంట.

అసలు 10 మంది ఎంపీలు కూర్చుని మాట్లాడుకుంటున్న వీడియో ఎలా బయటకు వచ్చిందని. అది ఖచ్చితంగా లోపలి వారి పనే అని అర్ధం అవుతుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇంటి దొంగలను పట్టుకోకపోతే అసలుకే మోసం వస్తుందన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు.

ADVERTISEMENT

దీనితో ఎంపీలను మందలించడంతో పాటుగా ఆ మాటామంతీ జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ టీవీ కెమెరా ఫ్యూటేజ్ తెప్పించమని పార్టీ నేతలను ఆదేశించారంట. దీనితో ఆ ఇంటి దొంగను పట్టుకోవడం కుదురుతుందని ఆయన భావన. మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ లు తమ వ్యాఖ్యలను వక్రీకరించారని, కట్ అండ్ పేస్ట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించారని వివరణ ఇచ్చారట. అయితే జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది.

ADVERTISEMENT
Latest Stories