My Home Bhooja or YSRCP Leaders Adda?

వైసీపీ పార్టీలోని మంచివాళ్ళు, సౌమ్యులు, అందగాళ్ళు ఒక్కొక్కరుగా అరెస్టవుతూ జైలు బాట పడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ రాకతో గత ఐదేళ్ల వైసీపీ నేతల పాపాలకు శిక్ష పడాల్సిందే అంటూ సామాన్యుడు సైతం ప్రభుత్వ చర్యలకు మద్దతుపలుకుతున్నారు.

ఇందులో భాగంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, రోజా, జోగి రమేష్ వంటి వైసీపీ నేతలు కానీ, పోసాని కృష్ణ మురళి, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి వంటి వైసీపీ సానుభూతి పరులు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మద్దతుతో చంద్రబాబు, లోకేష్, పవన్ ల మీద చెలరేగిపోయారు.

Also Read – వర్మగారి త్యాగాలకు ఇదా బహుమతి?

అక్కడితో ఆగకుండా వారి కుటుంబంలోని మహిళలను, చిన్నపిల్లలను సైతం వైసీపీ బూతు రాజకీయంలోకి లాగారు. దీనితో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు ఇరు పార్టీల మద్దతుదారులతో పాటుగా ఇటు ప్రజాస్వామ్యవాదులు కూడా కూటమి పై ఒత్తిడి పెంచారు. అయితే వీరిలో కొంతమంది ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లి దాక్కున్నారు.

ఇందులో తాజాగా అరెస్టయి జైలుకెళ్లిన వైసీపీ అందగాడు వల్లభనేని వంశీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని హైద్రాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ‘మై హోమ్ బూజా’ అపార్ట్మెంట్ లో ఏపీ పోలీసుల కంటికి చిక్కారు. అలాగే ఇప్పుడు వైసీపీలో మరో సౌమ్యుడు పోసాని కూడా అదే అపార్ట్మెంట్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!

ఇలా ఈ ఇద్దరు వైసీపీ అరాచకవాదులు కూడా ఒకే చోట ఏపీ పోలీసుల కంట పడడం యాదృచ్ఛికమా.? లేక వైసీపీ అరాచకవాదులకు మై హోమ్ బూజా అడ్డానా.? అనేది తెలియాలి. ఇక ఏపీ పోలీసుల కళ్లుకప్పి, కూటమి ప్రభుత్వ చర్యలకు చిక్కకుండా జారుకుంటున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మై హోమ్ బూజా లోనే దొరుకుతారేమో చూడాలి.




అలాగే ఈ మై హోమ్ బూజా లో ఇంకెంతమంది వైసీపీ దుష్ట శక్తులు దాగున్నారో అన్న అంశం మీద ఏపీ పోలీసులు దృష్ఠి సారిస్తే మరికొంతమంది ఈ కలుగులో నుంచి బయటకొస్తారో.? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?