అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా అరుదైన గౌరవం దక్కించుకోనుంది. నాసా సంస్థ ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ అనే అంతరిక్ష నౌకను తయారు చేసింది. సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లి, సూర్యుని పై విషయాలు తెలుసుకునే అంతరిక్ష నౌక ఇది. 4 మిలియన్ మైళ్ళు భూమి నుంచి ప్రయాణం చేసి, సూర్యుడ్ని చేరుకుంటుంది ఈ అంతరిక్ష నౌక. ఎస్. చంద్రశేఖర్ అనే ఇండియన్ సైంటిస్ట్ కూడా దీని తయారీ లో భాగం పంచుకోవడం విశేషం.
నా పేరు సూర్య నిర్మాతల్లో ఒకరైన గోపీచంద్ లగడపాటి.. ఈ సినిమా హిందీ వెర్షన్ ని, మెమరీ చిప్ లో కాపీ చేసి పార్కర్ సోలార్ ప్రోబ్ లో పెట్టామని, అది మరో 90 రోజుల్లో సూర్యుని దగ్గరకు వెళ్లనుందని, ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సినిమా ‘నా పేరు సూర్య’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. నాసా వెబ్ సైట్ లో మన పేరు కూడా రిజిస్టర్ చేసుకుంటే.. పార్కర్ సోలార్ ప్రోబ్ చిప్ లో మన పేరు కూడా సూర్యుడి దగ్గరకు వెళ్తుందన్న మాట. ఈ నెల 27 వ తారీఖుతో ఈ అవకాశం ముగిసింది.



