
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టగానే మొట్ట మొదట కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యంపై దృష్టి పెట్టారు.
Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?
గత 5 ఏళ్ళుగా కాకినాడ మాజీ వైసీపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులు కాకినాడ పోర్టుని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకుని, పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆఫ్రికా దేశాలను ఎగుమతి చేసి భారీగా సంపాదించుకున్నారు.
అయితే ఎన్నికలలో ఆయన, వైసీపి కూడా ఓడిపోయి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా పౌర సరఫరాశాఖ నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం తెచ్చుకోగలగడం, కాకినాడ పోర్టుని తమ కుటుంబం అధీనంలో ఉంచుకోగలగడం, అక్కడి నుంచి యధేచ్చగా ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తుండటం బరి తెగింపే అనుకోవచ్చు.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
ఈ అక్రమాలకు పౌరసరఫరా శాఖ, పోర్టు అధికారులు, సిబ్బంది అందరూ తోడ్పడుతుండటం వలననే ఇది సాధ్యపడుతోందని వేరే చెప్పక్కరలేదు.
కనుక మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి పెట్టి ద్వారంపూడి కబ్జాలో ఉన్న పోర్టుని విడిపించేందుకు చర్యలు చేపట్టడం చాలా అభినందనీయం.
Also Read – వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!
మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం మరోసారి పోర్టులో తనికీలు చేపట్టిన తర్వాత సిబ్బంది, కార్మికులు, సరుకు రవాణా వాహనాల యజమానులతో సమావేశమయ్యి అక్రమరవాణాకు ఎవరు సహకరించినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాకినాడ పోర్టు ఓ కుటుంబం కట్టలేదనే విషయం అందరూ గ్రహించాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని, పరోక్షంగా ద్వారంపూడిని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
పోలీసుల ప్రాధమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసుని సీఐడీ లేదా తగు దర్యాప్తు సంస్థకు అప్పగించి బియ్యం అక్రమ రవాణాకు పాల్పడినవారిపై చట్ట ప్రకారం కటిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అంటే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి జైలుకి పంపబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెపుతున్నట్లే.
షరా మామూలుగా వారి అక్రమాలకు సహకరించిన అధికారులు, సిబ్బందిపై కూడా కేసులు నమోదు కావడం ఖాయమే. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు వైసీపిలో ఎవరు జైలుకి వెళ్ళినా వారితో పాటు ఓ అరడజను మంది అధికారులను వెంట తీసుకుపోతారన్న మాట!