producer-naga-vamsi-about-daaku-maharaj-promotions

సంక్రాంతికి విడుదల కానున్న బాలకృష్ణ డాకు మహారాజ్ కు సంబంధించిన అప్ డేట్స్ పంచుకోవడానికి మీడియా ముందుకొచ్చిన దర్శకుడు బాబీ, నిర్మాత నాగ వంశీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న సినిమా రచ్చ మీద కూడా స్పందించారు.

జనవరి 12 న థియేటర్లకు రాబోతున్న డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించనున్నట్టు తెలిపారు నిర్మాత నాగ వంశీ. జాన్ 2 హైద్రాబాద్ లో మూవీ ట్రైలర్ లాంచ్, జాన్ 4 న అమెరికాలో ఒక సాంగ్ లాంచ్ ఇక అటు పిమ్మట జాన్ 8 న ఏపీ విజయవాడలో కానీ మంగళగిరిలో కానీ ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Also Read – డామిట్! పోర్టు పోయింది… ఈడీ కేసు మిగిలింది!

దీనితో పుష్ప మూవీ రిలీజ్ తరువాత తెలంగాణలో జరిగిన పరిణామాలు, అక్కడి ప్రభుత్వం తో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ తమ సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాలను ఏపీలో నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా భావించవచ్చు. అందునా ఆ సినిమాలో హీరో బాలయ్య ఏపీ హిందూపూర్ ఎమ్మెల్యే గా ఉన్నందున తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఏపీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

అలాగే ఇటు బెనిఫ్ట్ షో ల రద్దు, సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఎటు పాలుపోని సినీ ఇండస్ట్రీ ఆ దిశగా ప్రభుత్వంతో చర్చలు జరపనుందా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గాను మాకన్నా ముందు డిసెంబర్ 10 న దిల్ రాజు గారి గేమ్ ఛేంజర్ ఉన్నందున ఆయన US నుంచి వచ్చాక ఆ విషయం మీద చర్చిస్తామన్నారు నాగ వంశీ.

Also Read – ఒకరిది ‘గురు శిష్యుల’ బంధం…మరొకరిది ‘అన్నదమ్ముల’ స్నేహం.!

అలాగే జనవరి 10 న రాబోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషనల్ కార్యక్రమాన్నికూడా దిల్ రాజు ఏపీ కేంద్రంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఆ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

అయితే చెర్రీ, శంకర్ కాంబోలో రాబోతున్న గేమ్ ఛేంజర్ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడం, నిర్మాత దిల్ రాజు కూడా డల్లాస్ లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో ఈ మూవీలో కనిపించే కొన్ని సీన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నఇన్సిడెంట్స్ ను గుర్తు చేస్తాయి అంటూ వ్యాఖ్యానించి సినిమా మీద అంచనాలను పెంచారు.

Also Read – శ్రీలక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్… ఎవరి కోసం?


గత ఐదేళ్లు ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలతో పోరాడలేక రాజీ పడిన తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రా వైపు చూసే సాహసం కూడా చెయ్యలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంతో ఎదురయ్యింది. మరి ఇప్పటికైనా సినీ సెలబ్రేటిస్ ఏపీ పై సీత కన్ను వేయకుండా వేడుకలు నిర్వహించుకుంటారా..? ఏపీ అభివృద్ధికి టాలీవుడ్ నుండి తమ వంతు చేయూతనందిస్తారా.?