గుడికి వచ్చిన నాగ్… చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్..!

nagarajuna and Om Namo Venkatesaya crew visited Induru-Tirumala-templeదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటూ బిజీబిజీగా క‌నిపిస్తోన్న నాగార్జున, ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో సంద‌డి చేశారు. జిల్లాలోని నర్సింపల్లిలోని ఇందూరు తిరుమల దేవాలయానికి త‌మ చిత్ర బృందంతో వ‌చ్చిన నాగ్, ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు.

ADVERTISEMENT

వేంటేశ్వ‌రుడి భ‌క్తుడు హథీరాం బాబా జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వేంకటేశ్వరస్వామిగా న‌టించాడు. దేవాలయానికి వచ్చిన నాగార్జునను చూసేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కింగ్ కెరీర్ లో మరో హిట్ గా “ఓం నమో వేంకటేశాయ” సినిమా నిలుస్తుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories