అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పై నిర్మించిన “ఛి||ల||సౌ||” సినిమా ఈ నెల 3వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కింగ్ నాగార్జున మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ఇటీవల తాను “ఆర్ఎక్స్ 100” సినిమా చూశానని, చాలా బాగుందని అభిప్రాయపడ్డారు నాగ్.
‘ఎ’ సర్టిఫికేట్ ఉంది, వెళ్తే వెళ్ళండి లేకపోతే వద్దు, ఫ్యామిలీ సినిమాలన్నీ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చూస్తున్నారుగా” అంటూ ‘ఆర్ఎక్స్ 100’ను ఉదహరిస్తూ నాగ్ సెటైర్ వేసారు. కింగ్ పంచ్ ను అర్ధం చేసుకున్న మీడియా బృందం కూడా ఒక్కసారిగా నవ్వేసారు. ఫ్యామిలీ సినిమాలకు వచ్చిన తీర్పుకు, ‘ఆర్ఎక్స్ 100’ చేసిన వసూళ్ళకు నాగ్ సెటైర్ సరైనదే అనిపించక మానదు.
ఇక “ఛి||ల||సౌ||” సినిమా గురించి మాట్లాడుతూ… సినిమా చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకులను ఖచ్చితంగా అలరించే చిత్రంగా నిలుస్తుందని, ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రాహుల్ రవీంద్రన్ మరో సినిమాను తమ ప్రొడక్షన్ సంస్థలో డైరెక్ట్ చేయబోతున్నాడని, అంతగా ఈ సినిమా తమను ఆకట్టుకుందని, చిత్ర విజయంపై పూర్తీ విశ్వాసం వ్యక్తం చేసారు.