ప్రముఖ నటుడు నాగార్జున మాదాపూర్ వద్ద తుమ్మిడికుంట చెరువులో 3.30 ఎకరాల భూమి ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారంటూ హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం దానిని కూల్చివేశారు. దానిపై నాగార్జున చాలా హుందాగా స్పందించారు.
హైడ్రా పేర్కొన్నట్లు తాను ఎటువంటి భూకబ్జాకి పాల్పడలేదని అది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ అని దానిలోనే తాను ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించుకున్నానని చెప్పారు. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు హైకోర్టు కూల్చివేతపై స్టే జారీ చేసింది.
అది అమలులో ఉండగానే హైడ్రా నాకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చి వేసింది. ఇది నా గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని దాని వలన నా ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాను. అధికారులు చట్ట విరుద్దం కూల్చివేశారు కనుక నేను హైకోర్టుని ఆశ్రయిస్తాను. అక్కడ నాకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను,” అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
అయితే గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇప్పుడు హైడ్రా అధికారులు ‘ఎన్ కన్వెన్షన్ సెంటర్’ అక్రమ కట్టడమా కాదా అని చూసుకోకుండానే కూల్చివేశారని అనుకోలేము. నాలుగు శాఖల మంత్రులు, కార్యదర్శులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, డీజీపీ తదితరులు సభ్యులుగా ఉన్న హైడ్రా ఇటువంటి ఘోర తప్పిదం చేయదు. చేస్తే ప్రభుత్వానికే అప్రదిష్టం. పైగా హైకోర్టులో చీవాట్లు, నాగార్జునకి నష్టపరిహారం చెల్లించక తప్పదు.
ఇది అక్రమ కట్టడమే అయినప్పటికీ హైడ్రా అధికారులు అత్యుత్సాహంలో నాగార్జునకి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కూల్చివేసి ఉంటే కోర్టులో మొట్టికాయలు తప్పవు. ఇంతకీ నాగార్జున ఏమన్నారో ఆయన మాటల్లోనే….
స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 24, 2024




