సంధ్య థియేటర్ ఘటన, తదనంతర పరిణామాలపై ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. కొందరు అల్లు అర్జున్ తప్పేమీ లేదనుకుంటే, కొందరు ఆయనదే తప్పని భావిస్తున్నారు.
ఈ వ్యవహారంలో సిఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారమే వ్యవహరించారని కొందరు వాదిస్తుంటే, వేరేదో కారణాలతో అల్లు అర్జున్ పట్ల, సినీ పరిశ్రమ పట్ల కటినంగా వ్యవహరించారని మరికొందరు వాదిస్తున్నారు.
Also Read – ఎఫ్-1 కేసు: సుప్రీంకోర్టు సింపుల్‌గా తేల్చేసింది!
మోహన్ బాబుకి ముందస్తు బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానాలు, ఒకరి మృతికి కారకుడైన అల్లు అర్జున్‌కి చకచకా బెయిల్ మంజూరు చేస్తున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇలా ఈ వ్యవహారంలో ప్రతీ అంశంపై భిన్నాభిప్రాయలు వెలువడ్డాయి. కానీ చట్టం తన పని తాను చేసుకు పోతూనే ఉంది.
Also Read – మీడియా వారు జర భద్రం…!
ఈ కేసులో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కూడా భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
రూ.50,000 చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదనే షరతులని ఎవరూ తప్పు పట్టడం లేదు.
Also Read – విజన్ 2029 కూడా అవసరమేగా?
కానీ ప్రతీ ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలనే షరతు పట్ల ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్‌పై ఎవరికి ఎటువంటి అభిప్రాయాలున్నా ఆయన సినీ పరిశ్రమలో ఓ అగ్ర నటుడు. జాతీయస్థాయి ఉత్తమ నటుడు అవార్డు పొందిన వ్యక్తి. సమాజంలో ఆయనకు, వారి కుటుంబానికి చాలా గౌరవ మర్యాదలున్నాయి. అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా లక్షల మంది అభిమానులున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా భారీగా విరాళాలు ఇస్తుంటారు.
సంధ్య థియేటర్ ఘటనలో కొన్ని తప్పులు జరిగినా అల్లు అర్జున్ చట్టాన్ని గౌరవిస్తారు. ఆయనపై ఈ ఒక్క కేసు తప్ప మరే కేసు లేదు. అల్లు అర్జున్‌కి ఎటువంటి నేర చరిత్ర లేదు.
అల్లు అర్జున్ సినిమా షూటింగ్‌లతో క్షణం తీరిక లేని జీవితం గడుపుతుంటారు. వాటి కోసం విదేశాలకు వెళ్ళి వస్తుంటారు. కనుక ప్రతీ ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని షరతు విధించడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ ప్రతీవారం ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చినా, రాకపోయినా రెండూ ఇబ్బందే.
వస్తే పోలీస్ స్టేషన్ వద్ద అభిమానులను నియంత్రించడం పోలీసులకే శిక్షగా మారుతుంది. ఒకవేళ రా(లే)కపోతే అనుమతుల ప్రక్రియ, లేకుంటే మళ్ళీ నోటీసుల హడావుడి వేరే ఉంటుంది. కనుక అల్లు అర్జున్ పట్ల న్యాయస్థానం కూడా ఇంత కటినంగా వ్యవహరించడం సబబేనా?అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.