
నేడు న్యాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న మూవీ హిట్ 3 నుంచి టీజర్ ను విడుదల చేసారు మూవీ మేకర్స్. అయితే ఈ హిట్ సిరీస్ లో ఇది మూడవ సినిమా కాకా హిట్ 1 లో విశ్వక్, హిట్ 2 లో అడవి శేషు హీరోలుగా నటించి మెప్పించారు. ఇక ఈ హిట్ 3 లో నాని కనిపించబోతున్నారు.
అయితే ఈ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నాని ఇప్పుడు హీరోగా మారారు. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న వైలెన్స్, బ్లడ్ బాత్ సినిమాల ఫీవర్ నానిని కూడా తాకిందా అన్నట్టుగా హిట్ 3 టీజర్ మొత్తం బ్లడ్ బాత్ తో ఫుల్ వైలెన్స్ ను సృష్టించింది.
Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!
ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో అర్జున్ గా కనిపించిన నాని తన మునుపటి సినిమాలకు భిన్నంగా ఈ పాత్రను ఎంచుకున్నారని తెలుస్తుంది. ఒక ఫ్యామిలీ హీరోగా, పక్కంటి కుర్రోడిగా అలరించే నాని ఈ సారి మాత్రం తన రక్త పాతం తో ప్రేక్షకులను భయపెట్టేలా ఉన్నారు.
దీనిబట్టి నాని కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఫాలో అవుతున్న ఈ వైలెన్స్ కథలు, బ్లడ్ బాత్ సీన్ల ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా మే 1 న థియేటర్లలోకి రానున్న ఈ హిట్ 3 తన గత హిట్ సిరీస్ ల ఆనవాయితీని కొనసాగిస్తు నాని ఖాతాలో మరో హిట్ ను అందిస్తుందా.?
Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!
అయితే ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం అంటూ వరుస విజయాలతో హ్యాట్రిక్ ఊపు మీదున్న నాని తన ప్రతి సినిమాలోనూ భిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించారు. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 లో మరో వైవిధ్యమైన పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సృష్టించిన బ్లడ్ బాత్ హిట్ కు సరిపోతుందా.?