
పక్కంటివాడి అబ్బాయి లా, సహజ నటన ప్రదర్శించే న్యాచురల్ స్టార్ నాని తానూ నటించే సినిమాలలోనూ వైవిధ్యాన్ని చూపిస్తు సక్సెస్ అందుకుంటున్నారు, అలాగే తానూ నిర్మించే చిత్రాలతోను కొత్తదనాన్ని పరిచయం చేస్తు విజయాలను సొంత చేసుకుంటున్నారు.
చిన్న హీరోలతో, తోటి నటులతో చిన్న స్థాయి సినిమాలు నిర్మిస్తూ పెద్ద విజయాలను సొంత చేసుకుంటూ నిర్మాత గానూ రాణిస్తున్నారు నాని. ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే బ్యానేర్ పేరుతో 2018 లో ‘అ!’…సినిమాతో నిర్మాతగా మారిన నాని ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
Also Read – ప్రమోషన్స్ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!
ఈ మూవీ తో అటు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మకు దర్శకుడిగా తొలి అవకాశాన్ని కల్పించడంతో పాటుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియదర్శి తో సినిమాను తెరకెక్కించారు. అలాగే ‘హిట్’ సిరీస్ కు శ్రీకారం చుట్టి విశ్వక్ సేన్ కెరీర్ కు ఒక మంచి హిట్ అందించారు నాని. ఇక తాజాగా ‘కోర్ట్’ అంటూ మరోమారు ప్రియదర్శి తో కలిసి ముందుకొచ్చారు.
తనకు ఈ సినిమా విజయం మీద నమ్మకంతో సినిమా విడుదలకు ఒక రోజు ముందే ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించారు. అలాగే ఈ కోర్ట్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే తన తదుపరి చిత్రం హీరో కమ్ నిర్మాతగా చేస్తున్న హిట్ – 3 మూవీ కోసం ఎవరు థియేటర్లకు రావద్దు అంటూ ఒక ప్రమాదకరమైన ప్రకటన చేసారు నాని.
Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?
అయితే నాని నమ్మకం నెగ్గేలా కోర్ట్ మూవీ పై సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో నాని హీరోగానే కాదు నిర్మాతగానూ పూర్తి సక్సెస్ అయ్యారనిపిస్తుంది. ఇటువంటి చిన్న సినిమాల కోసం ప్రేక్షకుడు ధియేటర్ కు వస్తాడా.? లేక ఓటిటీ ని ఆశ్రయిస్తాడా.? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ థియేటర్లలో ‘కోర్ట్’ తన వాదనలను ప్రేక్షకుడికి బలంగా వినిపించగలుగుతుంది.
కథ బాగుంది కంటెంట్ ఆకట్టుకునేలా ఉంటే బడ్జెట్ తో పనిలేదు, హీరో ఇమేజ్ తో సంబంధం లేదు అనేలా కోర్ట్ మూవీ పై ప్రేక్షకులు ఆదరణ చూపుతున్నారు. దీనితో థియేటర్లలో నాని కోర్ట్ కేసు విజయం సాధించినట్టయ్యింది. ఇక హీరోగా రాబోయే తన తదుపరి మూవీస్ హిట్ – 3 మే 1 న రిలీజ్ కు రెడీ అవ్వగా, ది పారడైజ్ 2026, మార్చ్ 26 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలతో ఫ్యామిలీ హీరో నుంచి యాక్షన్ హీరోగా మారనున్నారు నాని.