టాలీవుడ్ యొక్క మొట్టమొదటి ప్రముఖ చిత్రం ఓటీటీ డీల్ ఇప్పుడు పూర్తయ్యిందని నివేదికలు వెలువడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు యొక్క ‘వీ’ దాని థియేట్రికల్ విడుదలను దాటవేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఓటీటీ మేజర్ ఈ చిత్రం కోసం 33 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.
ఈ వార్త నిజమైతే, దిల్ రాజు మంచి మొత్తాన్ని సంపాదించారనే చెప్పాలి. ఈ చిత్రం సెప్టెంబర్ 5 న ప్రసారం కానుందని పుకార్లు సూచిస్తున్నాయి. ఈ ఒప్పందం టాలీవుడ్‌లో ఫ్లడ్‌గేట్లను తెరవవచ్చు. ఆన్‌లైన్ విడుదల కోసం ఇతర పరిశ్రమల పెద్ద సినిమాలు వెళ్ళినప్పటికీ, తెలుగు సినిమా పరిశ్రమ ఐదు నెలల పాటు ఓటీటీ ప్లేట్ ఫార్మల ప్రలోభాలను బానే తట్టుకోగలిగింది.
వీ డీల్ ఫైనల్ కావడంతో మిగతావి వరుస కడతాయా అనేది చూడాలి. వీ ఉగాది స్పెషల్‌గా మార్చిలో విడుదల చేయాల్సి ఉంది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు లాక్డౌన్ ప్రకటించబడింది దానితో సినిమా నిరవధికంగా వాయిదా పడింది. చాలా కాలం తర్జన భర్జనలు పడ్డాకా దిల్ రాజు మరియు నాని ఇక నిరీక్షణ చాలు అనుకుని ఆన్‌లైన్ విడుదలకు ముందడుగు వేశారు.
అనుష్క నటించిన నిశ్శబ్దం, రామ్ నటిస్తున్న రెడ్, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి వంటి సినిమాలు డైరెక్టు ఆన్ లైన్ రిలీజ్ కోసం ఆలోచన చెయ్యవచ్చు. థియేటర్లు ఓపెన్ అయ్యాకా కూడా తమకు సరైన విడుదల తేదీ దొరకడం కష్టం అనుకునే ప్రతీ సినిమా ఆన్ లైన్ విడుదల చేసి చేతులు దులుపుకునే అవకాశం ఉంది.



