వర్ధమాన టీవీ నటుడు మరణం!

Nannam Sunil death in road accidentశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 సంవత్సరాల వర్ధమాన నటుడు నన్నం సునీల్ కాలం చేసారు. కొడవలూరు మండల పరిధిలోని రాచర్ల పాడు వద్ద నేషనల్ హైవేపై అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… పడుగుపాడు గ్రామానికి చెందిన షకీల్, హైదరాబాద్ లో సినీ సంగీత దర్శకుడిగా ఉండగా, బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన సునీల్‌ కొన్నేళ్లుగా ఆయన వద్ద చికిత్స పొందుతూ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్నాడు.

ADVERTISEMENT

షకీల్ తమ్ముడు సలావుద్దీన్ ఓ ఇంటర్వ్యూ నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లగా, అదే కారులో స్వగ్రామానికి వెళ్లేందుకు సునీల్ కూడా బయలుదేరాడు. రాచర్లపాడు వద్ద గుర్తు తెలియని వాహనం వీరి కారును ఢీకొనగా, సునీల్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో గాయపడిన షకీల్ తమ్ముడు సలావుద్దీన్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లగా, కోమాలోకి వెళ్ళినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. సునీల్ మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ADVERTISEMENT
Latest Stories