టీజర్ టాక్ – దోచుకునేలానే ఉంది!

Nannu Dochukunduvate Movie Teaserహీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ బావ సుధీర్ బాబు ప్రస్తుతం నిర్మాతగా మారి “నన్ను దోచుకుందువటే” అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తనే హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేసారు. టైటిల్ కు సరిపోయే విధంగా స్ట్రిక్ట్, సీరియస్ గా ఉన్న ఒక అబ్బాయిని జోష్ ఫుల్ తో ఉండే ఒక అమ్మాయి ఎలా దోచుకుంది? అన్నదే సినిమా కాన్సెప్ట్ గా టీజర్ చెప్పేసింది.

ADVERTISEMENT

‘సమ్మోహనం’ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సుధీర్, ఈ సినిమాలో సీరియస్ గా కనపడుతూ ఫన్ క్రియేట్ ప్రయత్నం చేసాడు. ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ పై కనపడుతుండగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ మూడ్ ను ఎలివేట్ చేసింది. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ద్వారా నభా నటేష్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories