టిడిపి దీక్షలు… దున్న పోతు పై వానే?

Nara-Bhuvaneshwari-TDP-Deekshaటిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి అప్పుడే మూడు వారాలైంది. అప్పటి నుంచి ఆయన న్యాయపోరాటాలు చేస్తుంటే, టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మహాత్ముడు సూచించిన మార్గంలో ‘సత్యమేవ జయతే’ పేరుతో ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు, బయట టిడిపి శ్రేణులతో కలిసి ఆయన అర్దాంగి నారా భువనేశ్వరి దీక్షలు చేస్తున్నారు.

అక్కడ హైదరాబాద్‌, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, తారకరత్న భార్య ఆలేఖ రెడ్డి, వారి కుమార్తె నిష్క, గారపాటి శ్రీనివాస్, చలసాని చాముండేశ్వరి, నందమూరి జయశ్రీ, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, టిడిపి కార్యకర్తలు ఇంకా పలువురు దీక్షలో కూర్చోన్నారు.

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, మాజి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తదితరులు దీక్షలో పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం మొదలైన ఈ దీక్షలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇవి కాక గత మూడు వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు దీక్షలు చేస్తూనే ఉన్నారు.

అయితే వైసీపి ప్రభుత్వం వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఓపక్క చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఇంతమంది దీక్షలు చేస్తుంటే, నారా లోకేశ్‌, నారాయణలను అరెస్ట్ చేయడానికి ఏపీ సీఐడీ సిద్దపడుతుండటమే ఇందుకు నిదర్శనం.

కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేసులు, అరెస్టులను పట్టించుకోకపోవడంతో వైసీపి ప్రభుత్వం ఈ విషయంలో మరింత ఉత్సాహంగా ఉంది.

బుధవారం వరకు నారా లోకేశ్‌పై ఎటువంటి చర్య తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించినా, బుధవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏపీ సీఐడీ నోటీస్ ఇవ్వడం ఇందుకు చిన్న ఉదాహరణ. కనుక టిడిపి దీక్షలతో రాష్ట్ర ప్రజలపై చాలా ప్రభావం ఉండవచ్చేమో కానీ వైసీపి ప్రభుత్వంపై ఏమాత్రం లేదనే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories