
ఈసారి దావోస్ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ 1.79 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దావోస్ సదస్సు నుంచి ఈరోజు హైదరాబాద్ తిరిగివచ్చిన సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, నేతలు ఘన స్వాగతం పలికి అభినందించారు. కానీ బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు మాత్రం విమర్శిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
“గత ఏడాది రూ.40,000 కోట్లు పెట్టుబడులు తెచ్చామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నారు కానీ ఒక్క రూపాయి కూడా తేలేదని” బిఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ విమర్శలు గుప్పించారు.
Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?
మళ్ళీ ఆయనే గత ఏడాది దావోస్ సదస్సులో రేవంత్ రెడ్డి తన దోస్తు అదానీని బ్రతిమాలుకొని రాష్ట్రంలో రూ. 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారని చెప్పారు. గత ఏడాది వచ్చిన ఆ రూ.40,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, ఇప్పటికే 80 శాతం నిర్మాణపనులు జరుగుతుండగా, మిగిలిన 20 శాతం వివిద దశలలో ఉన్నాయని సిఎం రేవంత్ రెడ్డి చెప్పుకున్నారని అంటూనే, గత ఏడాది ఒక్క రూపాయి కూడా తేలేదని బిఆర్ఎస్ నేతలు విమర్శించడాన్ని ఏమనుకోవాలి?
ఇక బీజేపి ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “దావోస్ సదస్సుకి ఇక్కడి నుంచే పారిశ్రామికవేత్తలను తీసుకువెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకొని ఫోటోలు దిగి అక్కడకు వెళ్ళి పెట్టుబడులు సాధించామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు,” అని విమర్శించారు.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
గతంలో ఎన్నడూ లేనివిదంగా ఈసారి దావోస్ సదస్సుకి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. వారి సమక్షంలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వదేశీ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒప్పందాలు చేసుకున్నారు. అంటే దావోస్ సదస్సులో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వమే సాక్ష్యం అన్న మాట!
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 1.79 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తే అంతా బోగస్ అని కొట్టిపడేస్తున్న బీజేపి నేతలే, పక్క రాష్ట్రం మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ సుమారు రూ.15.70 లక్షల కోట్లు సాధిస్తే, ఆహా ఫడ్నవీస్.. ఓహో బీజేపీ.. మోడీ పాలన, అభివృద్ధి..” అంటూ పొగుడుకుంటున్నారు! ఇది బీజేపి ద్వంద వైఖరి కాదా?
Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?
తెలంగాణలో పెట్టుబడులు తెచ్చినా సిఎం రేవంత్ రెడ్డికి విమర్శలు తప్పడం లేదు. పెట్టుబడులు రాకపోతే వైసీపీ నేతలు ఊరుకుంటారా? ఊహించిన్నట్లే మూకుమ్మడిగా సిఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై దాడి చేస్తున్నారు.
కనుక పెట్టుబడులు తెచ్చినా తెలంగాణలో ప్రతిపక్షాలు, తేనందుకు ఇక్కడి ప్రతిపక్షం ఏడ్పులు ఏడుస్తున్నాయి. కానీ తమ ఏడ్పులే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకి ఆశీర్వాదాలుగా మారుతుంటాయని గ్రహించడం లేదు.