దేవాన్ష్ చిన్న పిల్లోడే కానీ… వరల్డ్ రికార్డ్

Nara Devaansh World Record chess

చంద్రబాబు నాయుడు రాజకీయాలలోకి ఏ స్థాయికి ఎదిగారో అందరం చూస్తున్నాము. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ రాజకీయాలలో ప్రవేశించినప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, ఎదురుదెబ్బలు తిన్నా భయపడి తప్పుకోలేదు.

ప్రత్యర్ధుల విమర్శలను, అవహేళనలను ఎదురుదాడి చేసి తప్పించుకునే బదులు వాటి నుంచే పాఠాలు నేర్చుకొని తనని తాను తీర్చుదిద్దుకొని నేడు ఈ స్థాయికి చేరారు.

ADVERTISEMENT

కానీ నారా లోకేష్‌ని అంతగా అవహేళన చేసినవారు మాత్రం తమ తప్పులు, లోపాలు, బలహీనతల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. కనుక వారి పరిస్థితి దిగజారింది.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ తర్వాత వారి ఏకైక వారసుడు నారా దేవాన్ష్ వయసు పదేళ్ళే. కానీ ఆ పిల్లాడు కూడా తాత, తండ్రికి తగ్గవాడినేనని అప్పుడే నిరూపించుకున్నాడు.

చెక్ మేట్ మారధన్ పోటీలలో అత్యంత వేగంగా 175 చెక్ మేట్ ఫజిల్స్ సాధించడంతో దేవాన్ష్ పేరు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లోకి ఎక్కింది.

లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన ఈ ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ అవార్డుల ఫంక్షన్‌లో నిర్వాహకులు దేవాన్ష్ కు ఈ అవార్డు ప్రధానం చేశారు.

దేవాన్ష్ అత్యంత అరుదైన ఈ రికార్డ్ సాధించి అవార్డు అందుకోవడంపై అతని తండ్రి నారా లోకేష్‌, తాతగారు చంద్రబాబు నాయుడు ఇద్దరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. అతనిని అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారు.

ఇంత చిన్న వయసులోనే గంటల తరబడి చందరంగం బోర్డుకి అంకితమైపోయి ఆ ఆట నేర్చుకోవడమే కాకుండా ప్రపంచ రికార్డ్ కూడా సాధించడం తండ్రిగా తనకు చాలా గర్వంగా ఉందని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

ADVERTISEMENT
Latest Stories