
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తాజాగా అమలు చేస్తున్న వాట్స్ అప్ గవర్నెన్స్ విషయంలో తమకు అనుమానాలున్నాయని, ఆ నెపంతో ప్రభుత్వం ప్రజల డేటా చోరీకి పాల్పడుతుందంటూ వైసీపీ టీడీపీ మీద రాజకీయ ఆరోపణలు చేస్తుంది.
అయితే ఆ ఆరోపణల మీద స్పందించిన ఐటీ మంత్రి నారా లోకేష్ వాట్స్ అప్ గవర్నెన్స్ తో డేటా చోరీ జరిగింది అంటూ వైసీపీ నిరూపించగలిగితే తన సొంత డబ్బు 10 కోట్లు రూ. కానుక కింద చెక్ రాసిస్తానంటూ బహిరంగా ప్రకటించి వైసీపీ కి సవాల్ విసిరారు. అయితే ఈ వాట్స్ అప్ గవర్నెన్స్ గురించి బహుశా జగన్ కు తెలిసి ఉండకపోవచ్చు అంటూ జగన్ గత వ్యాఖ్యలను గుర్తు చేసారు.
Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!
గతంలో టీవీ 9 కి ఇచ్చిన ఇంటర్ వ్యూ లో జగన్ మాట్లాడుతూ తనకు అసలు ఫోన్ లేదని, నా నెంబర్ కూడా నాకు తెలియదంటూ వ్యాఖ్యానించిన వైనాన్ని మరోసారి బయటకు తీసి అటు జగన్ కు ఇటు టీవీ 9 కి కౌంటర్ ఇచ్చారు లోకేష్. అప్పట్లో జగనే చెప్పారు కదా తనకు ఫోన్ లేదని ఇక ఫోన్ లేని వాడికి వాట్ అప్ గురించి ఎంతెలుస్తుందిలే సామీ అంటూ ఛలోక్తులు వేస్తూనే, ఇప్పుడు జగన్ కు ఫోన్ కొనిఇవ్వమంటారా ఏంటి అంటూ మీడియావారికి ఎదురు ప్రశ్న వేసి లోకేష్ నవ్వులు పూయించారు.
అలాగే జగన్ ఇప్పుడు ఎలాగూ ఎక్కువకాలంలో బెంగళూర్ లోనే ఉంటున్నారు కాబట్టి మా ప్రభుత్వ సేవలు అక్కడిదాకా విస్తరించలేమంటూ జగన్ పార్ట్ టైం పొలిటిషన్ అనేలా పరోక్షంగా సెటైర్లు వేశారు. అయితే గతంలో వైసీపీ ప్రవేశ పెట్టిన వాలంటీర్ విధానంలో తప్పులు దొర్లుతున్నాయని, దాని ఫలితంగా ఏపీ ప్రజల డేటా చోరి అయ్యి హైద్రాబాద్ మాదాపూర్ లో ఒక ఆఫీస్ లో ఉందంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ మీద నిప్పులు చెరిగారు.
Also Read – జనసేన ‘చిరు’దరహాసం…!
అయినా కూడా వైసీపీ అధినేత జగన్ కానీ ఆ పార్టీ ముఖ్య నేతలు కానీ ఎవరు ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణలు మీద సవాల్ చేస్తూ ముందుకొచ్చింది లేదు. పవన్ ప్యాకేజ్ స్టార్, పెళ్లిళ్ల స్టార్ అంటూ వ్యక్తిగత దాడితో సరిపెట్టారు తప్ప లోకేష్ మాదిరి, కూటమి ప్రభుత్వం లెక్క బహిరంగ ఛాలెంజ్ కు పిలుపునిచ్చి తమ నిజాయితీని, నిబద్ధతను చాటుకోలేకపోయారు.
కానీ లోకేష్ మాత్రం పథకం ప్రారంభించిన నాడే ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చి ఆరోపణల పై స్పందిస్తూ మేము తప్పు చెయ్యలేదు, చెయ్యబోము, దమ్ముంటే నిరూపించండి, నిరూపిస్తే సొంత సొమ్ము ఇస్తాను అంటూ బలమైన ఛాలెంజ్ విసిరి అటు వైసీపీ నోరు కి తాళం వేసే పని చేసారు. అలాగే ఇటు ప్రజలలో నమ్మకాన్ని కల్పించగలిగారు.
Also Read – వ్యవస్థలకి జగన్ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!
దీనితో నీతికి..అవినీతి మధ్య ఉన్న ఆ చిన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించగలిగారు లోకేష్. అయితే లోకేష్ ఇచ్చిన ఈ 10 కోట్ల ఆఫర్ ను వైసీపీ సద్వినియోగం చేసుకుంటూ ఛాలెంజ్ ను స్వీకరించి ఆరోపణలను నిరూపించడానికి ముందుకొస్తుందా లేక మరోసారి తూచ్ అంటూ సైలెంట్ అవుతుందా.?