
ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని కాపాడటం లేదా దేశం కోసం ప్రాణాలు బలివ్వడం అంటే ఏమిటో సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోతున్న వీర జవాన్లను చూస్తే అర్దమవుతుంది. తాజా ఘర్షణలలో శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం కళ్ళి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ పాక్ తూటాలకు బలైయ్యారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత కళ్ళి తండాకు వెళ్ళి అతని తల్లితండ్రులను ఓదార్చారు.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున వారికి రూ.50 లక్షల నగదు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాలు ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి మరో రూ.25 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని కళ్యాణ్ తెలిపారు.
రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడ వాలిపోయి శవరాజకీయాలు చేసే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ, జిల్లాకు చెందిన వైసీపీ నేతలు గానీ యుద్ధభూమిలో దేశం కోసం పోరాడుతూ చనిపోయిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. సోషల్ మీడియాలో మొక్కుబడిగా ఓ సంతాప సందేశం, నివాళులు పెట్టి మమ అనిపించారు.
Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!
కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సహాయ మంత్రులందరూ మురళీ నాయక్ భౌతిక కాయానికి సెల్యూట్ చేసి నివాళులు అర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరిగాయి. మంత్రి నారా లోకేష్ ఆయన శవ పేటికని మోశారు.