గంజాయి హబ్‌గా ఏపీ… ఇదేం ఖర్మ!

Nara-Lokesh-Andhra-Pradesh-Ganja-Hubఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళయినా ఇంతవరకు రాజధానిలేని రాష్ట్రంగా మిగిలిపోయినందుకు ప్రజలు సిగ్గుతో తలదించుకొంటున్నారు కానీ సిఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలకు చీమ కుట్టిన్నట్లయినా లేదని తెలంగాణ మంత్రులు విమర్శలతో మరోసారి నిరూపితమైంది.

ఈ అవమానం సరిపోదన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిపోవడం చాలా బాధాకరమని నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ని కలిసి ఏపీలో చాప కింద నీరులా వ్యాపించిపోయిన ఈ గంజాయి ఉత్పత్తి, రవాణా, సేవించడం గురించి ఫిర్యాదు చేశారు.

ADVERTISEMENT

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అది ఏపీ నుంచే వచ్చిందని పోలీసులే చెపుతున్నారు. ఏపీలో నిత్యం ఎక్కడో అక్కడ వందల కేజీల గంజాయి పట్టుబడుతూనే ఉండటం గమనిస్తే, గంజాయి రవాణా ఆగడం లేదని అర్దమవుతోంది.

నేను ఇప్పటివరకు పలు జిల్లాలు, పట్టణాలు, గ్రామాల గుండా 2,000 కిమీకి పైగా పాదయాత్ర చేశాను. ఈ పాదయాత్ర ద్వారా స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఏవిదంగా గంజాయికి అలవాటు పడుతున్నారో తెలుసుకొన్నాను. గంజాయి వ్యాపారాలు చేస్తున్నవారు ముందుగా చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేసి వారినే తమ డిస్ట్రిబ్యూటర్లుగా వాడుకొంటున్నారు. దీంతో ఆ పిల్లల జీవితాలు ఇంకా ప్రారంభం కాకమునుపే నాశనం అవుతున్నాయి.

గంజాయి వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని నేను నా పాదయాత్రలో గుర్తించాను. ఇదే విషయం నేను గవర్నర్‌కు తెలియజేసి గంజాయిని అరికట్టేందుకు కటినమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరాను. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులోనే తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అతికిరాతకంగా చంపేశాడు.

రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతుంటే సిఎం జగన్‌ కనీసం ఒక్కసారి కూడా డిజిపిని, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరుపలేదు. కానీ రాంగోపాల్ వర్మతో ‘వ్యూహం’ సినిమా గురించి చర్చించారు. పంజాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగంపై ఉడ్తా పంజాబ్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఏపీలో గంజాయి వినియోగంపై ‘ఉడ్తా ఏపీ’ అని సినిమా తీయాలేమో?

ఏపీలో క్రైమ్ రేటు ఇంతగా పెరగడానికి, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు పెరగడానికి కారణం ఈ గంజాయే. వైసీపీ నేతల అండదండలు లేకుండా గంజాయి సాగు, రవాణా, వ్యాపారం సాధ్యం కాదు. తక్కువ కాలంలో సులువుగా డబ్బు సంపాదించుకొనేందుకు వారు ప్రజలు, మహిళలు, చివరికి చిన్న పిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు,” అని నారా లోకేష్‌ ఆరోపించారు.

ADVERTISEMENT
Latest Stories