వైసీపీ, కూటమికి తేడా ఇదే!

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో కాశినాయన జ్యోతి క్షేత్రంలో శ్రీ నరసింహస్వామి ఆలయం, ఆ ఆలయ ఆవరణలో అన్నదాన సత్రం ఉన్నాయి.

ADVERTISEMENT

దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నదాన సత్రంలో భోజనం చేసి వెళ్తుంటారు. భక్తులు వచ్చినా రాకపోయినా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే అనాధలకు అక్కడ భోజనం పెడుతుంటారు.

కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సొంత డబ్బుతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి కేవలం రూ.5కే నిరుపేదలకు భోజనం పెడుతున్న టీడీపీ నేతలు, సుమారు దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా నిరంతర అన్నదానం చేస్తున్నప్పుడు, కాశీనాయన అన్నదాన సత్రాన్ని అటవీశాఖ అధికారులు కూల్చివేయడాన్ని సమర్ధిస్తారనుకోలేము.

కాశీ నాయిన జ్యోతి క్షేత్రం రక్షిత నల్లమల అటవీప్రాంతంలో ఉన్నందున దానిని తొలగించేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, ఆన్నదాన సత్రం కూల్చివేసిన విషయం కూటమి ప్రభుత్వం తెలుసుకోలేకపోవడం పొరపాటే.

ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతుండే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, హిందూ మతాన్ని, హిందువులను రక్షించే బాధ్యత తమదే అన్నట్లు వ్యవహరించే బీజేపి గానీ, కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాన్ని అటవీశాఖ అధికారులు కూల్చివేసే వరకు తెలుసుకోలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇటువంటి చర్యలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి, ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖకి, ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, బీజేపికి చాలా చెడ్డపేరు తెస్తాయి.

ఈ కూల్చివేతల గురించి మంత్రి నారా లోకేష్‌ దృష్టికి రావడంతో తక్షణం వాటిని నిలిపివేయించారు. జరిగిన పొరపాటుకు ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పుకున్నారు కూడా. తన సొంత ఖర్చుతో అక్కడే ఆన్నదాన సత్రం నిర్మించి ఇస్తానని ట్వీట్ చేశారు.

ఏ ప్రభుత్వంలోనైనా చిన్న పెద్ద పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి సరిచేసుకోవడం, జరిగిన పొరపాటుకి ఇలా బహిరంగంగా ఓ మంత్రి క్షమాపణలు చెప్పడం చాలా హుందాగా ఉంది.

వైసీపీ పాలనలో అంతర్వేది ఆలయంలో స్వామివారి రధం మంటల్లో కాలిపోయింది. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు దొంగతనం అయ్యాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కొండపై శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేశారు.

కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన్నట్లు ఆరోపణలు వస్తే జగన్‌ ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఇలా జరిగిన తప్పులను ఒప్పుకొని క్షమాపణ కోరలేదు. వైసీపీ, కూటమికి తేడా ఇదే!

AP temple demolition issue

ADVERTISEMENT
Latest Stories