ఆంధ్రాలో ప్రతిపక్షాలే లేకుండా చేస్తే?

Nara Lokesh Chandrababu-Naidu- Pawan Kalyan Jaganఆంధ్రాలో ప్రతిపక్ష నేతలెవరూ ప్రజల మద్యకు వెళ్ళకుండా అడ్డుకొనేందుకే వైసీపి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

ADVERTISEMENT

నారా లోకేశ్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ప్రజల మద్యకు వెళ్తున్నారు. నేను యువగళం పాదయాత్రతో ప్రజల మద్యనే ఉన్నాను. పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రతో ప్రజల మద్యకు వెళ్తున్నారు. కనుక మమ్మల్ని అడ్డుకొనేందుకే ఈ కేసులు పెడుతున్నారని భావిస్తున్నాను. కానీ వైసీపి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటాలు ఆపే ప్రసక్తే లేదు. త్వరలోనే నేను మళ్ళీ యువగళం పాదయాత్ర మొదలుపెడతాను,” అని చెప్పారు.

అయితే వైసీపి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వారిని అడ్డుకొనేందుకు ఓ పెద్ద వ్యూహమే అమలుచేసింది. అదే… మూడు రాజధానులు! అది పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అని పైకి చెపుతున్నప్పటికీ అసలు కారణం మాత్రం ప్రతిపక్షనేతలను ప్రజల మద్యకు రానీయకుండా అడ్డుకోవడమే.

ఈ పేరుతో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంద్రా జిల్లాలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజలను టిడిపి, జనసేన నేతలకు వ్యతిరేకంగా ఉసిగొల్పాలని మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు ఎంతగా ప్రయత్నించారో అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర ప్రజలు ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించడంతో, దాని వెనుక ఉండే ఈ వ్యూహాన్ని వైసీపి అమలుచేయలేకపోయింది. ఒకవేళ దాని వ్యూహం ఫలించి ఉంటే, నేడు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, పవన్‌ కళ్యాణ్‌లతో సహా రెండు పార్టీల నేతలెవరూ ప్రజల మద్యకి రాగలిగేవారే కాదు. కానీ ప్రజలు వారికి జేజేలు పలుకుతుండటం చూసి వైసీపి కంగు తింది.

అందుకే వెంటనే జీవో నంబర్: 1 తెచ్చింది. దాంతో టిడిపి, జనసేన నేతలని ప్రజల మద్యకు వెళ్ళకుండా అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేయడం అందరూ చూశారు. కానీ అదీ ఫలించలేదు!

దీంతో టిడిపిపై ఈ అక్రమ కేసుల బ్రహ్మాస్త్రాన్ని సందించి చంద్రబాబు నాయుడుని కట్టడి చేయగలిగింది. రేపు నారా లోకేశ్‌ని అరెస్ట్ చేసి కట్టడి చేస్తుంది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ని ఇదే విదంగా కట్టడి చేయడం ఖాయం!

ఏదో విదంగా ప్రతిపక్ష నేతలను ప్రజల మద్యకు రానీయకుండా అడ్డుకోగలితే ఇక రాష్ట్రంలో వైసీపికి ఎదురే ఉండదు. ప్రతిపక్ష నేతల గొంతులను వినిపించకుండా చేస్తే, అప్పుడు సంక్షేమ పధకాలు, చంద్రబాబు నాయుడు అవినీతి, పవన్‌ కళ్యాణ్‌ ప్యాకేజి స్టార్ అంటూ ఎన్నైనా చెప్పుకోవచ్చు… శాసనసభ నుంచి ప్రతిపక్షాలను సస్పెండ్ చేసి సొంత డప్పుకొన్నట్లుగా!

గత ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపి ఈసారి గెలవలేమని ముందే గ్రహించిన్నట్లుంది. అందుకే రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తే ప్రజలకు మరో మార్గం లేక మళ్ళీ వైసీపినే ఎన్నుకొంటారని దురాశపడుతున్నట్లుంది.

కానీ ఆనాడు ఇందిరాగాంధీ కూడా దేశంలో ఎమర్జన్సీ విధించి ప్రతిపక్ష నేతలందరినీ జైళ్ళలో నిర్బందించారు. కానీ ఆమె ఆలోచన బెడిసికొట్టింది. ఇప్పుడు ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా మరోసారి అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కనుక వైసీపికి ఎదురుదెబ్బ తప్పదు. ఆయన నిర్ణయానికి వైసీపి నేతలందరూ మూల్యం చెల్లించుకోవడం కూడా ఖాయమే.

ADVERTISEMENT
Latest Stories