కలవకుంట్ల కవిత భవిష్యత్ రాజకీయం పై రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చ జరుగుతుండగా కవిత టీడీపీ లోకి వస్తే ఎలా ఉంటుంది.? అనే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, అలాగే తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో నేడు మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న నారా లోకేష్ ముందుకు ఈ ప్రశ్న వచ్చి చేరింది. కవితను టీడీపీ పార్టీలోకి తీసువడం పై మీ స్పందన అంటూ మీడియా మిత్రులు లోకేష్ అభిప్రాయాన్ని కోరగా అందుకు లోకేష్ ఘాటైన సమాధానం ఇచ్చారు.
కవితను టీడీపీ లోకి తీసుకోవడం అంటే జగన్ టీడీపీలోకి చేర్చుకోవడమే అవుతుంది అంటూ పార్టీలో కవిత చేరిక మీద వస్తున్న అపోహలకు ఒకే ఒక్క సమాధానం తో చెక్ పెట్టారు. అయితే టీడీపీ కి ప్రథమ ప్రత్యర్థిగా భావించే వైసీపీ అధినేత వైస్ జగన్ తో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోల్చడం అంటే టీడీపీ కవితకు ఎంత దూరంగా ఉండాలని భావిస్తుందో చెప్పకనే చెప్పారు లోకేష్.
అయితే టీడీపీ పార్టీ పై కవిత గత చరిత్ర చూసుకుంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నుంచి నేటి బనకచర్ల ప్రాజెక్ట్ వరకు ప్రతి విషయంలోనూ కవిత టీడీపీ టార్గెట్ గానే రాజకీయం చేసింది, నారా చంద్రబాబు పతనం లక్ష్యంగానే అడుగులు వేసింది.
నాటి బిఆర్ఎస్ నుంచి నేటి జాగృతి వరకు కవిత రాజకీయం టీడీపీ కి ప్రత్యామ్నాయంగానే సాగుతుంది. తెలంగాణ అనే ప్రాంతీయ వాదం తో బిఆర్ఎస్ లో మొదలైన కవిత రాజకీయ ప్రస్థానం నేడు జాగృతి లో సామజిక తెలంగాణ అంటూ పయనిస్తుంది.
దీనితో టీడీపీ కి ఎప్పటికి జగన్ రాజకీయ ప్రత్యర్దే అనేది ఎంత వాస్తవమో కవిత కూడా పసుపు జెండాకు ఆ స్థాయి రాజకీయ విరోధే అన్నది అంతే యదార్ధం అంటూ టీడీపీ భవిష్యత్ అధినేత నారా లోకేష్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ టీడీపీ లో ప్రచారం అవుతున్న కవిత టీడీపీ ఎంట్రీ మీద వస్తున్న అపోహలన్నీ ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. అలాగే తానూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వివిధ సందర్భాలలో కలిశానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.
దీనితో టీడీపీ కి కవిత దూరం అన్న క్లారిటీని ఇచ్చారు, కేటీఆర్, లోకేష్ తో మంతనాలు అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతల ఆరోపణలకు అధికారిక ముద్ర వేశారు.




