జగన్ అనే వైరస్ కు మందు వస్తుంది!

Nara Lokesh - Jagan -2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి తనయుడిగా మంగళగిరిలో పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూసిన నారా లోకేష్, తన తప్పులను సరిద్దిదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు చేరువ కావడంలో విఫలమైన లోకేష్, అధికార పక్ష పాలనను ఎండకడుతూ చేస్తోన్న యాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

గత పది రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తోన్న లోకేష్, మునుపటితో పోలిస్తే స్పీచ్ లోనూ, ప్రజలను అక్కున చేర్చుకోవడంలోనూ చాలా మెరుగయ్యారనేది స్థానికంగా జరుగుతోన్న చర్చ. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు భరోసా కల్పించడంలో ఓ నాయకుడిగా లోకేష్ సఫలమవుతున్నారు.

ADVERTISEMENT

గతంలో లోకేష్ మాట్లాడుతున్నప్పుడు దొర్లిన తప్పులతో ప్రత్యర్థి పార్టీలు ‘పప్పు’ అన్న విమర్శలు చేసేవారు. వాస్తవంగా మాట్లాడుకుంటే, నాటి వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలే తలలు పట్టుకున్నారు. కానీ నేడు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ప్రజలను ఆకట్టుకునే విధంగా లోకేష్ చేస్తోన్న విమర్శలు గానీ, వాడుతున్న పదజాలం గానీ కార్యకర్తలను ఎంతగానో ఉత్సాహపరుస్తోంది.

రాజధాని గ్రామాల్లో రైతులకు పెన్షన్స్ గానీ, కౌలు గానీ ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం లేదని తాజాగా ప్రజలు లోకేష్ కు మొరపెట్టుకున్నారు. అసలు జగన్ రెడ్డి మీకు ఇస్తారని ఆశ ఉందా? రాజధానిని అభివృద్ధి చేస్తారని ఇంకా మీరు నమ్ముతున్నారా? అభివృద్ధి వికేంద్రీకరణ అంటోన్న ఈ జగన్ రెడ్డి అమరావతికి ఒక్క రోడ్డు అయినా వేశాడా?

పేద వాళ్లకు, కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వడు తల్లి. మంగళగిరి, తాడికొండ ప్రజలపైన కక్ష్య పెట్టుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అభివృద్ధి చేయకూడదన్న కక్షతో అక్కడ సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ సైకో శాసనసభ్యుడు ఉన్నాడు, ఇద్దరూ సైకోలుగా తయారయ్యారు, మనం బాధపడుతున్నాము అంటూ చేసిన స్పందనకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

ఎన్నికలకు ఇంకా రెండున్నర్రేళ్ళ సమయం ఉందన్న లోకేష్, మరో ఏడాదిన్నర్రలో జగన్ అనే వైరస్ కు ప్రజలు వాక్సిన్ కనిపెడతారని అనుకుంటున్నానని, “అది మీ ఓటు” అని చెప్పిన లోకేష్, ‘మీరు ఓటు వేస్తే జగన్ వైరస్ పోతుందని’ తన వాక్చాత్యుర్యాన్ని ప్రదర్శించారు.

ఒకప్పుడు ఏదయితే తన వీక్ నెస్ గా తోటి సహచరులు, ప్రత్యర్థి పార్టీలు వర్గాలు విమర్శించారో నేడు దానినే ప్రదర్శిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించారు లోకేష్. చోటా బాస్ లో వచ్చిన ఈ మార్పు తెలుగుదేశం కార్యకర్తలను జోష్ లో నింపింది.

ADVERTISEMENT
Latest Stories