
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ గెలిచేస్తూనే ఉంది! ఏవిదంగా అంటే ఎక్కడో ఎవరో హత్య, అత్యాచారం, పారిశ్రామిక ప్రమాదాలు, తొక్కిసలాటలు జరిగితే జగన్ అక్కడ వాలిపోయి నానాయాగీ చేసేస్తుంటారు. కనుక ఆయనకి ఆ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం అంతకంటే వేగంగా ముందుగా స్పందిస్తుంటుంది.
కనుక తమ ఒత్తిడి, భయం వల్లనే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని జగన్ చెప్పుకుంటున్నారు. అలాగే పింఛన్ చెల్లింపుల విషయంలో కూడా జగన్ కంటే తామే సవ్యంగా, సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తారీఖున లేదా ఒక రోజు ముందుగానే చెల్లించేస్తోంది.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
ఇతర ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఇందుకే చాలా చురుకుగా స్పందిస్తోంది. తాజాగా ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్ కోసం వైసీపీ ఆందోళనలకు సిద్దమయ్యింది. అయితే ఆ హడావుడిలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందనే విషయం మరిచిపోయింది.
ఇప్పుడు దానిని మార్చి 12కి వాయిదా వేసుకుంది. కానీ అప్పుడూ వైసీపీకి ఆ అవకాశం లేకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్ రెండో విడత చెల్లింపులకు రూ.232 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!
కనుక వైసీపీ, కూటమి ప్రభుత్వం మద్య సాగుతున్న ఈ రేసులో ఏది పైచేయి సాధిస్తోందనేది పక్కన పెడితే, వాటి మద్య సాగుతున్న ఈ పోటీ వలన సామాన్య ప్రజలకు మేలు జరుగుతోంది కనుక సంతోషించాల్సిందే.
అయితే ఎన్నికల హామీల అమలు విషయంలో మాత్రం వైసీపీ ఎంత ఒత్తిడి చేస్తున్నా కూటమి ప్రభుత్వం లొంగడం లేదు. భయపడటం లేదు. తొందరపడటం లేదు. కనుక “నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటేనా..?” అంటూ జగన్ సంక్షేమ పధకాల డప్పు కొట్టుకోగలుగుతున్నారు.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
కానీ పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో మళ్ళీ జగన్ బోర్లా పడుతున్నారు. జగన్ 5 ఏళ్ళ పాలనలో సంక్షేమ పధకాల గోల తప్ప పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదు.
ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు సాధిస్తుంటే అవన్నీ మేము సాధించిపడేసినవే.. వాటిని తన సొంతమని చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు వాదిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
కనుక కూటమి ప్రభుత్వంపైఒత్తిడి తెచ్చి తాము పైచేయి సాధించాలని వైసీపీ తృప్తి పడుతుంటే, వైసీపీకి ఆ అవకాశం లేకుండా చేసి మనమే పైచేయి సాధించామని కూటమి ప్రభుత్వం తృప్తి పడుతోంది. కనుక రెండు పార్టీలు దేనికవి మెమే ప్రత్యర్ధిపై పైచేయి సాధించామని తృప్తి పడుతున్నాయి.