మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీల పట్ల ఎంత చిత్తశుద్దిగా ఉంటారు అనేదానికి నేడు మంగళగిరిలో జరిగిన ఒక ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.
గత ఏడాది రంజాన్ మాసంలో మంగళగిరిలో పర్యటించిన లోకేష్ మంగళగిరి బస్ స్టాండ్ సమీపంలో ఉన్న షహేన్షా అనే ఒక ముస్లిం కుటుంబం యొక్క ఇంటికి వెళ్లారు, అక్కడ దీనావస్థలో ఉన్న వారి ఇంటిని చూసి చలించిపోయారు.
దీనితో వారి కుటుబం హాయిగా నివసించేందుకు అనుగుణంగా ఉండేలా ఆ శిధిలావస్థలో ఉన్న ఇంటి స్థానంలో మరో కొత్త ఇంటిని నిర్మించి ఇస్తానంటూ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు లోకేష్ సరిగ్గా ఏడాది సమయం తీసుకుని ఈ రంజాన్ పర్వదినాన ఆ ముస్లిం కుటుంబానికి కొత్త ఇంటిని బహుమతిగా అందించారు.
దీనితో తమ పవిత్ర పండుగ పూట లోకేష్ ఇలా తమ కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చడంతో ఆ ముస్లిం కుటుంబ సభ్యులలో కళ్ళలో ఆనందం స్ఫష్టంగా కనిపిస్తుంది. అందుకుగాను వారు తమ ఎమ్మెల్యే లోకేష్ కు కృతజ్ఞతలు తెలియచేసారు.
దీనితో లోకేష్ చర్యల పై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. గత పాలకులకు నేటి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్నీ, గత రాజకీయ నాయకులకు నేటి ప్రజా నేతలకు మధ్య ఉన్న అంతరాన్ని లోకేష్ తన చర్యలతో చేసి చూపిస్తున్నారు అంటూ లోకేష్ పై ప్రశసంలు కురుస్తున్నాయి.
అలాగే ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, అటు టీడీపీ భవిష్యత్ నాయకుడిగా, ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రిగా లోకేష్ తన మీద ఉన్న అన్ని బాధ్యతలను, కర్తవ్యాలను చిత్తశుద్దిగా వ్యవహరిస్తూ భవిష్యత్ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారనే చెప్పాలి.






