
ఒకప్పుడు జనం, మీడియా ముందుకు వస్తే మాట్లాడేందుకు తడబడే నారా లోకేష్, ఇప్పుడు ప్రజల వద్దకు, మీడియా ప్రతినిధుల వద్దకు వెళ్ళి స్వయంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు చేసిన విమర్శలు, అవహేళనలే ఆయనలో ఈ మార్పుకి కారణమని అందరికీ తెలుసు.
తాను అమెరికాలో ఉన్నత విద్యలభ్యసించినప్పుడు నేర్చుకున్న దానికంటే చాలా ఎక్కువ, చాలా కొత్త విషయాలు యువగళం పాదయాత్ర చేసినప్పుడు తెలుసుకున్నానని, ఆ ఒక్క పాదయాత్రతో తన ఆలోచన ధోరణి సమూలంగా మారిపోయిందని నారా లోకేష్ చెప్పారు.
Also Read – వైసీపీ నేతలు బిజీ బిజీ… ఒకరు బయటికి మరొకరు లోపలికి!
శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు నారా లోకేష్ చెప్పిన సమాధానాలు విన్నప్పుడు, ఆయన మరింత పరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది.
పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒంటరిగా కూర్చొని ట్వీట్స్ వేసే స్థాయి నుంచి ఢిల్లీలో ఓ సీనియర్ పాత్రికేయుడు ఎదుట కూర్చొని మాట్లాడేస్థాయికి నారా లోకేష్ ఎదగడం చాలా అభినందనీయమే.
Also Read – రుషికొండ ప్యాలస్‌కు 500 కోట్లు.. పక్కనే ఉన్న బీచ్‌కి జీరో!
ఈ సందర్భంగా నారా లోకేష్ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు క్లుప్తంగా..
· కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకి చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. మాకు చంద్రబాబు నాయుడు ఉన్నారు.
Also Read – త్రిభాషా…డీలిమిటేషన్ పై పవన్ స్పందన…
· ఆన్‌లైన్‌లో అన్నీ లభిస్తున్నప్పుడు ప్రభుత్వ సేవలు మాత్రం ఎందుకు లభించవనే ఓ సామాన్య పౌరుడి ప్రశ్న నుంచే వాట్సప్ గవర్నెన్స్ ఆలోచన ఆవిర్భవించింది. ప్రభుత్వ దృవీకరణ పత్రాల కోసం సామాన్య ప్రజలు
ఎన్నిసమస్యలు ఎదుర్కొంటున్నారో అప్పుడే తెలుసుకున్నాను.
· రాజకీయాలలో వారసులు వస్తారు కానీ వారి నాయకత్వ లక్షణాలను పార్టీ కార్యకర్తలు, ప్రజలు గుర్తించినప్పుడే రాణించగలరు. నన్ను నేను నిరూపించుకున్నాక, కార్యకర్తలు, ప్రజలు నన్ను ఆమోదించినందునే నేను ఈ స్థాయికి
చేరుకోగలిగానని భావిస్తున్నాను.
· కుల సర్వే కంటే నైపుణ్యాల సర్వే చాలా కష్టమని భావిస్తున్నాను. ఓ మనిషి కులమేమిటో ఆ కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఎవరెవరికి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకోవడమే చాలా కష్టం.
రాష్ట్రంలో ఎంతమందికి ఎటువంటి నైపుణ్యాలున్నాయనే విషయం తెలుసుకుంటే వారికి ఉద్యోగం, ఉపాధి మార్గాలు చూపించడం తేలికవుతుంది.
· రెడ్ బుక్ ఉంది. అబద్దం కాదు. కానీ అది రాజకీయ కక్ష సాధింపుల కోసం కాదు. యధేచ్చగా చట్టాలను ఉల్లంఘించి అవినీతి, అక్రమాలకు పాల్పడినవారి కోసం మాత్రమే. వారికీ చట్టం శక్తి ఏమిటో తెలియాలి కదా?
· నా తండ్రిగారు స్థాపించిన హెరిటేజ్ డైరీని ఇప్పుడు నా భార్య చూసుకుంటున్నారు. ఓ భార్యగా, తల్లిగా, పారిశ్రామికవేత్తగా మహిళలు రాణిస్తున్నప్పుడు ఏడాదికి ఒక్క రోజు కాదు.. ప్రతీరోజూ మహిళా దినోత్సవం జరుపుకోవాలి.
· మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ భద్రత (జెడ్ ప్లస్) కల్పిస్తున్నాము.
· భారత్‌లో ఇంత జనాభా, ఇన్ని భాషలు కలిగి ఉండటమే మనకి పెద్ద అడ్వాంటేజ్. కనుక భాషల విషయంలో పరిమితులు, గొడవలు అవసరం లేదు. ఎక్కడైనా తొలి ప్రాధాన్యత మాతృభాష ఉండాలి. ఆ తర్వాత ఎవరు ఎన్ని
భాషలు నేర్చుకోగలిగితే అంతా ప్రోత్సహించాలి. మా ప్రభుత్వం హిందీతో సహా దేశ భాషాలన్నీటికీ సమాన ప్రాధాన్యత ఇస్తుంది. విదేశీ ఉద్యోగాల కోసం విదేశీ భాషలు నేర్చుకునేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నాము.
· రాజకీయాల కోసం, ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాల విభజన, త్రిభాషా విధానం వంటి కొన్ని సమస్యలను ఆయా రాష్ట్రాలలో పార్టీలు హైలైట్ చేస్తుంటాయి. ఇప్పుడు మేము ఆ యుద్ధంలో ప్రవేశించనవసరం
లేదు.
యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్ ఇంత పరిపక్వత సాధించారు. జగన్ కూడా పాదయాత్ర చేసి ఏం నేర్చుకున్నారు? ఏం చేశారు? ఏం జరిగింది?అని ఆలోచిస్తే తేడా తెలుస్తుంది.