గత ఐదేళ్లుగా నాయకులను, నియంతలను చూసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు నేస్తాలను, సన్నిహితులను చూస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, ఒక మంత్రిగా ఏపీ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు నారా లోకేష్.
ప్రస్తుత విద్యాశాఖ, ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేష్ సమస్యల మీద అప్పటికప్పుడు స్పందిస్తున్న తీరు, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్న విధానం అందరి దృష్టిని తన వైపు ఆకర్షించుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుండి వినతి పత్రాలు అందుకుంటూ మీకు అండగా నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నారు.
IIT , NIT , IIIT లో అర్హత సాధించిన దివ్యంగా విద్యార్థులకు ఇంటర్ మీడియట్ బోర్డు లో చాల కాలంగా అమలులో ఉన్న విధానం వలన ఆ సంస్థలలో అర్హత కోల్పోవాల్సి వచ్చింది. దీనితో ఆ విద్యార్థులలో ఒకరు లోకేష్ వాట్స్ అప్ నెంబర్ కు ఒక్క మెసెజ్ చేయాగ దాని పై తక్షణమే స్పందించిన లోకేష్ దానికి సంబందించిన అధికారులను అప్రమత్తం చేసి వారి చదువులకు ఎటువంటి ఆటంకం రాకుండా నాలుగు రోజులలోనే సమస్యకు జీవో తో సమాధానం చెప్పారు.
అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కిండుగూడ గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి ఒక పాఠశాల కూడా లేకపోవడంతో స్థానిక ప్రజలందరూ కలిసి ఒక పాకను నిర్మించుకున్న విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ వెంటనే స్పందించి ఆ గ్రామస్తులను అభినందించారు. అలాగే ఆ గిరిజన ప్రాంతంలో వెంటనే పాఠశాల కు ఒక భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లిన ఏపీ వాసులు అక్కడ వారు పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో సత్వరమే స్పందించిన లోకేష్ వారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకొచ్చారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి చెందిన బసవయ్య లక్నో ట్రిపిల్ ఐటీ లో సీటు సాధించారు.
అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 4 లక్షల ఫీజు తాను చెల్లించలేమని అందుకు తనకు సహాయం చేయాల్సిందిగా X లో లోకేష్ ను సాయం కోరాడు. ఈ విషయం పైన స్పందించిన లోకేష్ తనపెద్డ మనస్సును మరోసారి చాటుకున్నారు. ముందుగా బసవయ్య కు శుభాకాంక్షలు తెలియచేస్తూ నువ్వు కోరుకున్న లక్నో ట్రిపిల్ ఐటీలో చుదువుకోవాలి అనే నీ కల ఖచ్ఛితంగా నెరవేరుతుంది.
నీ ఫీజు విషయం నేను చూసుకుంటాను అంటూ బసవయ్యకు ఒక అన్నలా కొండంత అండగా నిలబడ్డారు. ఇలా మంత్రి లోకేష్ తన దృష్టికి వచ్చిన సమస్యల పైన ఒక రాజకీయ నాయకుడు మాదిరి కాకుండా ఒక అన్నలా, నేస్తంలా, ఒక సోదరుడిలా స్పందిస్తూ సమస్యకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నారు. సమస్యల పై లోకేష్ స్పందించిన తీరు, సమస్యల పరిష్కారానికి ఆయన చూపిస్తున్న చొరవ హర్షించదగ్గ పరిణామం.




