రోజమ్మా … అప్పుడు పళ్ళు రాలగొట్టలేదేమీ?

Nara_Lokesh_Jabardast_Aunty_Rojaటిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ సత్యవేడు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కె. రోజాని ఉద్దేశ్యించి ‘జబర్దస్త్ ఆంటీ’ అంటూ ఆమె భూకబ్జాలని బయటపెట్టారు. సహజంగానే ఆమె ఆగ్రహంతో రగిలిపోతూ “నా గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి,” అంటూ నారా లోకేష్‌ని హెచ్చరించారు. ఆమె హెచ్చరికలకి నారా లోకేష్‌ కూడా వెంటనే జబర్దస్త్ జవాబు ఇచ్చారు.

“తల్లీ రోజమ్మా… ఆనాడు జగన్‌ రెడ్డిగారు నా తండ్రి చంద్రబాబు నాయుడుగారిని చాలా మాటలన్నారు. కనిపిస్తే చెప్పుతో కొట్టాలని, చీపుర్లతో కొట్టాలని, కాలర్ పట్టుకొని నిలదీయాలని, బంగాళాఖాతంలో విసిరేయాలని అన్నారు. మరి ఆనాడు నువ్వు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?మా తల్లిగారు… అంటే ఎన్టీఆర్‌గారి కుమార్తె… ఏనాడూ రాజకీయాలలోకి రాలేదు… రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఆమె ఎన్టీఆర్‌ ట్రస్ట్, వ్యాపారాలకే పరిమితం అయ్యేవారు. అటువంటి ఆమెని శాసనసభలో మీ జగన్‌ రెడ్డి ఎదుటే మీ వైసీపీ ఎమ్మెల్యేలు అవమానకరంగా మాట్లాడుతుంటే, ఆనాడు నువ్వు ఎందుకు నోరు విప్పలేదమ్మా? మీ వాళ్ళ పళ్ళు ఎందుకు రాలగొట్టలేదమ్మా?” అని నారా లోకేష్‌ ప్రశ్నించారు.

ADVERTISEMENT

ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించుకొందామన్న మంత్రి రోజా సవాలుపై స్పందిస్తూ, “అమ్మా! నీకు తెలుసో తెలీదో… మేము చాలా కాలం నుంచే ఏటా మా ఆస్తుల వివరాలని ప్రకటిస్తున్నాము. నీకు దమ్ముంటే నువ్వు, మీ జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులు కూడా ప్రకటించండి చూద్దాం,” అని నారా లోకేష్‌ సవాలు విసిరారు.

ADVERTISEMENT
Latest Stories