రాష్ట్రంలో తాజా రాజకీయాలు ఊపందుకున్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటనలతో కాకరేపిన రాజకీయాలు ఇప్పుడు హస్తినలో నారాలోకేష్ అమిత్ షా తో భేటీ అంటూ వస్తున్న కథనాలతో తార స్థాయికి చేరాయి. గడిచిన కొద్దికాలం క్రితం తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లో షా తో జూ.ఎన్టీఆర్ భేటీతో మొదలైయిన వైసీపీ రాజకీయ విమర్శలు ఇప్పుడు లోకేష్ మీటింగ్ తో ముగుస్తాయేమో చూడాలి.
జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీతో లాజిక్ లేని స్టేట్ మెంట్స్ తో మీడియాలో హడావుడి చేసిన వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పుడు ఎలా స్పందిస్తారో అంటూ ఆసక్తి చూస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఒక్కసారి అమిత్ షా తో భేటీ అయితేనే ఎన్టీఆర్.., చంద్రబాబు నుండి టీడీపీ ని హస్తగతం చేసుకుంటారు అని వ్యాఖ్యానించిన నాని ఇప్పుడు జూనియర్ నుండి నారా లోకేష్ టీడీపీ పార్టీని కైవసం చేసుకుంటారని అంటారేమో అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
అప్పుడు జూ.ఎన్టీఆర్ కూడా కొత్త పార్టీ పెట్టి …., అప్పటికే మరో కొత్త పార్టీని ఏర్పాటుచేసుకున్న చంద్రబాబు తో కలిసి జూనియర్ వస్తారు అని మరో కొత్త వాదన తెర మీదకు తెస్తారో లేక లోకేషే, చంద్రబాబుని.., టీడీపీ ని కాదని బీజేపీ తో కలసి పోటీచేస్తారో..! అంటూ కొడాలి పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ని గద్దె దింపడానికి ఇటు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ.., జనసేన కు తోడు బీజేపీ కూడా మద్దతు ఇస్తే వైసీపీకి 2014 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయనేది ‘జగన్’ ఏరిగిన సత్యమే.
అయితే ఇప్పటికి లోకేష్ – షా భేటీ పై అటు టీడీపీ గాని ఇటు బీజేపీ గాని అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కానీ “నిప్పులేనిదే పొగ రాదనే”…, సామెత ఆధారంగా ఇటువంటి వార్తలకు బలం చేకూరుతుంది. ఆజాదికా అమృత్ మహోత్సవం లో భాగంగా ఢిల్లీ లో జరిగిన కార్యక్రమానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుని ఆహ్వానించడం.., మోడీ – బాబు వ్యక్తిగతంగా కలవడం..,బాబు అనుకూల వ్యక్తిగా పేరుపొందిన రామోజీరావు తో అమిత్ షా మంతనాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశ మార్చే ప్రయత్నాలే అంటూ పొలిటికల్ సర్కిల్స్ లోన్ గట్టిగా వినపడుతున్న మాట.
ఈ రకమైన భేటీలతో కంగారు పడుతున్న వైసీపీ అప్రమత్తమై టీడీపీ నేతల మీద దాడులకు పాల్పడి వారిని మానసికంగా.., శారీరకంగా భయపెట్టి., బెదిరించి రాష్ట్రంలో అశాంతికి – అల్లర్లకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్ల వాదన. ఇంతకీ కొత్త పార్టీ పెట్టేదెవరో..,ఉన్న పార్టీల అధ్యక్ష పదవులు మార్చేదెప్పుడో.., బీజేపీతో కలిసేదెవరో.., బీజేపీని కాదనేదిఎవరో ఎవరో….?ఈ ప్రశ్నలన్నింటికీ కొడాలి నానినే సమాధానం చెప్పాలి అంటూ టీడీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.



