nara-lokesh-met-venna-balakotireddy-family

ప్రస్తుతానికి ఏపీ లో ఎం నడుస్తుంది అంటే లోకేష్ హవా నడుస్తుందనే చెప్పాలి. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి తనయుడిగా, మంగళగిరి ఎమ్మెల్యే గా, టీడీపీ నాయకుడిగా ఏపీలో ఇప్పుడు లోకేష్ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు.

విద్యా వ్యవస్థలలో తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పులు కానీ, విద్యార్థులకు వారికొచ్చే ప్రభుత్వ పథకాలకు రాజకీయాలను దూరం చేస్తూ, రాజకీయ నాయకుల ఫోటోల ముద్రణ సంస్కృతిని చెరిపేస్తూ తీసుకున్న నిర్ణయాలు కానీ,

Also Read – అహంతో కేసీఆర్‌, జగన్‌, ఆహాన్ని జయించిన బాబు

విద్యార్థులతో మాటామంతి మొదలుకుని, వారి సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపే విధానాల వరకు, వాట్స్ అప్ మెసేజ్ ల నుంచి వాట్స్ అప్ గవర్నెన్స్ వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు అంటూ ముందుకొస్తున్నారు.

విద్యార్థుల అవసరాలకు అవసరమైన వసతులు అందించడం నుంచి ఉపాధి కోసం ఎదురు చూసే యువతను ప్రోత్సహించడం వరకు తనదైన స్టైల్ లో రాజకీయం చేస్తున్నారు లోకేష్. అలాగే ఇటు ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని పారిశ్రామికగా అభివృద్ధి చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.

Also Read – శ్యామల చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి..!

ఇక తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో నిత్యం ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అందుకు తగిన చర్యలకు ఆదేశాలిస్తున్నారు. ఇలా ప్రభుత్వంలో, పాలనలో తనదైన మార్క్ చూపిస్తూనే అటు పార్టీ మీద కూడా పట్టు సాధిస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన గుంటూరు జిల్లా రొంపచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు ‘వెన్నా బాలకోటిరెడ్డి’ కుటుంబసభ్యులను కలుసుకున్న లోకేష్ పార్టీ పరంగా తామంతా కుటుంబానికి అండగా ఉంటామనే భరోసాను కల్పించారు. వచ్చింది ఓదార్చడం కోసం, చేయాల్సింది కుటుంసభ్యుల ను పరామర్శించడం అనేటట్టుగానే లోకేష్ ఆ బాధిత కుటుంబసభ్యులను కలుసుకుని వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లారు.

Also Read – బిఆర్ఎస్ బతకాలి అంటే ఏపీ చావాలా.?

పార్టీ కోసం కష్టపడిన కుటుంబాలకు పెద్ద కొడుకులా అండగా ఉంటా, టీడీపీ కి పార్టీ కార్యకర్తలే బలం, వారి బాధ్యత నాది, ఇక పై తానే నేరుగా పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను కలుస్తాను అంటూ హామీ ఇచ్చారు. దీనితో లోకేష్ పార్టీకి అవసరమైన నాయకుడిగా ప్రభుత్వానికి కావల్సిన సేవకుడిగా రెండు బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు అనే వాదన నానాటికి బలపడుతుంది.




అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే, ఓదార్పు పేరుతో, పరామర్శల వంకతో లోకేష్, జగన్ మాదిరి బలప్రదర్శన చేయడం లేదు, పార్టీ క్యాడర్ ను తరలిస్తూ జై జై లు కొట్టించుకోవడం లేదు. ఇది లోకేష్ లో బయటపడుతున్న మరో మంచి కోణం అవుతుంది.