
గత ఐదేళ్ల వేధింపులకు, మానసిక ఆవేదనకు కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుంది, చెయ్యాలి అని ఆశ పడిన టీడీపీ, జనసేన మద్దతుదారులకు ఈ ఆరు నెలలు ఒకరంగా నిరాశే పలుకరించిందని చెప్పాలి.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
తమ అభిమాన నాయకుడిని దూషించిన ప్రతి నోటికి సమాధానం చెప్పే రోజు కోసం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అవమాన భారాలను ఎదుర్కొంటు, కేసులు భరిస్తూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన టీడీపీ, జనసేన మద్దతుదారులకు ఆ కోరిక ఇప్పటికి అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది.
అధికార మదంతో ఒక మాజీ ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేత అనే మర్యాద లేకుండా, పదేళ్ల రాజకీయ పోరాటానికి విలువ ఇవ్వకుండా, ఆడవాళ్లు, చిన్న పిల్లలు అనే కనీస మానవత్వం కూడా చూపకుండా బరితెగించిన వైసీపీ కీచకుల అరాచకాలకు కూటమి ప్రభుత్వం తగిన శిక్షలు వేయలేకపోయిందంటూ టీడీపీ, JSP శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
Also Read – అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కారన్న మాట!
ఈ నేపథ్యంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడానికి సొంత ఊరు వెళ్లిన నారా లోకేష్ టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రెడ్ బుక్ లో పొందు పరిచిన ప్రతి ఒక్కరు వారి పాపాలకు తగిన మూల్యం చెల్లించే రోజు త్వరలో వస్తుంది, రెడ్ బుక్ తన పని తానూ చేసుకుంటూ పోతుందంటూ పేర్కొన్నారు.
అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్, ఇసుక మాఫియాలు నడిపిన చాలామంది త్వరలో జైలుకు వెళ్ళబోతున్నారంటూ చంద్రగిరి నియోజకవర్గ పార్టీ క్యాడర్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాఖ్యానించారు నారా లోకేష్. దీనికి తోడు పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
అయితే లోకేష్ చెపుతున్నట్టుగా ఏపీలో రెడ్ బుక్ ప్రభావం వైసీపీ నేతల మీద ఉంటుందా అంటే అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుంది కానీ ఆచరణలో మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదుగా అంటున్నారు టీడీపీ శ్రేణులు.
నిజంగా లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ పని చేస్తుంటే ఇంకా కొడాలి, వల్లభనేని వంటి వారు బయట తిరుగుతారా.? రోజా, పేర్ని నాని, అంబటి వంటి నేతల నోటి దూలకు ఇప్పటికి తాళం పడకుండా ఉంటుందా.? ఆర్జీవీ, పోసాని, శ్రీ రెడ్డి లాంటి వారికి క్షమార్హత ఉంటుందా.? వివేకా కేసు నిందితులు, లిక్కర్ మాఫియా గుండాలు, ఇసుక మాఫియా బకాసురులు, రేషన్ బియ్యం దొంగలు ఇప్పటికి తమ దందాలను కొనసాగిస్తూనే ఉంటారా?
వీరందరికి అడ్డుకట్ట వేయలేని ఈ రెడ్ బుక్ వల్ల టీడీపీ శ్రేణులకు కలిగే మేలేమిటి.? గత ఐదేళ్ల తమ కష్టాలకు ప్రతిఫలం ఎక్కడ? అనుకుంటూ ఈ విషయంలో మేము నిన్ను ‘నమ్మలేం దొర’ అంటూ మౌనంగానే తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు టీడీపీ పార్టీ కార్యకర్తలు.
తమకు, తమ కుటుంబానికి జరిగిన నష్టానికి, కష్టానికంటే కూడా తమ అధినేతకు, వారి కుటుంబానికి జరిగిన అవమానాలకు, తమ పార్టీకి జరిగిన అవహేళనలకు న్యాయం కావాలి అని నిలదీయడం పార్టీ క్యాడర్ అత్యాశ అవుతుందా.? పార్టీ పెద్దలు కూడా ఈ దిశగా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. చట్టానికి వ్యతిరేకంగా కాదు చటానికి కట్టుబడి చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుకుంటున్న ఈ చిన్న ప్రాణాల కోరిక కూటమి ప్రభుత్వం తీర్చగలుగుతుందా.?