సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకు వస్తున్నప్పుడు, స్థానిక వైసీపీ నేతలు సంక్షేమ పధకాల లబ్ధిదారుల, విద్యార్థుల చేతుల్లో ‘థాంక్ యు సిఎం సర్’ అని వ్రాసున్న ప్లకార్డులు పెట్టి ప్రదర్శింపజేస్తుంటారు. సిఎం సభకు మీడియా కవరేజ్ ఉంటుంది కనుక సిఎం జగన్ పట్ల రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా, కృతజ్ఞతాభావంతో ఉన్నారనే సంకేతాలు వెళ్తాయని వారి ఆలోచన కావచ్చు.
కానీ జగన్ ప్రసంగిస్తుండగానే జనాలు లేచి వెళిపోతుండటం గమనిస్తే ఆయన పాలన గురించి ప్రజలేమనుకొంటున్నారో అర్దమవుతుంది లేదా ప్రతీ నెల జీతాల కోసం ఆందోళనలు చేస్తున్న ఉపాధ్యాయులను లేదా గుంతలు పడిన రోడ్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్న డ్రైవర్లను అడిగినా చెపుతారు.
టిడిపి యువనేత నారా లోకేష్ శుక్రవారం ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు దారిలో నల్లజర్ల గ్రామంలో ఓ శిలాఫలకం చూసి ఆగిపోయారు.
శిలాఫలకంలో ఏమి వ్రాశారంటే, “నూరుశాతం సిమెంటు రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పింఛన్లు, ఆహార భద్రత, ఎల్ఇడి వీధి దీపాలు, గ్యాస్ సిలెండర్లు అందజేసి నల్లజర్లను స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నల్లజర్ల గ్రామప్రజలు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము,” అని ఉంది.
ఆ శిలాఫలకాన్ని గ్రామప్రజలు 2017, ఏప్రిల్ 29వ తేదీన ఆవిష్కరించిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నాటి సిఎం చంద్రబాబు నాయుడుకి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకొంటూ ఏర్పాటు చేసిన ఆ శిలాఫలకం వద్ద నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ ఫోటో తీసుకొని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తే సిఎం జగన్, కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇస్తున్న నిధులను కూడా స్వాహా చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే దాని గురింహి ప్రజలు చెప్పుకొంటే గొప్పగా, గర్వంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు హయాంలో టిడిపి ప్రభుత్వం చేసిన మంచిపనుల గురించి గ్రామ ప్రజలు శిలాఫలకం వేసి మరీ కృతజ్ఞతలు తెలుపుకొంటే, వైసీపీ నేతలు సంక్షేమ పధకాల లబ్ధిదారుల, విద్యార్థులను బలవంతంగా బటన్ నొక్కుడు సభలకు తీసుకువచ్చి వారి చేతుల్లో ‘థాంక్ యు సిఎం సర్’ అని వ్రాసున్న ప్లకార్డులు పెట్టి ప్రదర్శింపజేస్తుంటారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యక్తిత్వాలకు, టిడిపి, వైసీపీ పాలనకు, రెండు పార్టీల నేతల ఆలోచనలకు ఉండే తేడాకు ఈ రెండు ఉదాహరణలే అద్దం పడుతున్నాయి కదా?
పంచాయితీల నిధుల దొంగ జగన్ రెడ్డి!
ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు చెబుతూ 2017లో నల్లజర్ల ప్రజలు ఏర్పాటు చేసిన శిలాఫలకం. గత ప్రభుత్వ హయాంలో నూరుశాతం సిమెంటు రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పింఛన్లు, ఆహార… pic.twitter.com/bC5lTPlZQ4— Lokesh Nara (@naralokesh) September 1, 2023



