పెగాసిస్ ఏపీ అటు అసెంబ్లీలోను.,ఇటు మండలిలోనూ రాజకీయ మంటలను రాజేసిందనే చెప్పాలి. నాటి చంద్రబాబు హయాంలో పెగాసిస్ సాఫ్ట్ వేర్ ని టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే మమతా ఆరోపణతో మొదలైన రచ్చ ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. పెగాసిస్ సాఫ్ట్ వేర్ ని మా ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేయలేదని ఈ వైసీపీ వాదనలో వాస్తవం లేదని నారా లోకేష్ వైసీపీ నాయకుల ఆరోపణలను ఖండించారు.
నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి 25-7-2021న RTI చట్టం కింద పెగాసిస్ సాఫ్ట్ వేర్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొనుగోలు చేసిందా? అని., ఏపీలో ఈ పెగాసియా ఆఫీస్ ఎప్పుడు,ఎక్కడ పెట్టారో అడ్రెస్ చెప్పాలని., ఎవరి హయాంలో ఈ కొనుగోళ్లు జరిగాయో తెలపాలని మూడు ప్రశ్నలను సంధించారు. ఇందుకు గాను జగన్ రైట్ హ్యాండ్ గా వర్క్ చేసిన నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీ ప్రభుత్వం అసలు ఈ పెగాసిస్ సాఫ్ట్ వేర్ ని కొనుగోలు చెయ్యలేదని సమాధానం చెప్పిన ఉదంతాన్ని వైసీపీ నాయకులకు., ప్రజలకు ఆధారాలతో సహా మీడియా ముందుంచారు లోకేష్.
పెగాసిస్ కొనుగోళ్లకు సంబంధించిన ఎటువంటి విచారణకైనా టీడీపీ పార్టీ సిద్ధం అంటూ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు లోకేష్.151 మంది ఎమ్మెల్యే లు ఉన్నామని జబ్బలు చరుచుకొనే ఈ జగన్ రెడ్డి గడిచిన మూడేళ్ళుగా తమపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఎవరో ఎదో అన్నారని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఈ పెగాసిస్ సాఫ్ట్ వేర్ ను మా ప్రభుత్వమే కనుక కొనుగోలు చేసుంటే వివేకా హత్యకు మొదటి ఫోన్ అవినాష్ రెడ్డా., వైస్.భారతి రెడ్డా., గంగి రెడ్డా ఇలా ఎవరి నుండి కాల్ వెళ్లిందో తెలుసుకొనే వాళ్ళం కదా! అసలు హత్యే జరగకుండా చూసే వాళ్ళం కదా.! జగన్ మోసపు రెడ్డి అంటూ కాస్త వ్యంగ్యంగా చురకలు అంటించారు టీడీపీ నాయకులు. అయినా మూడేళ్ళుగా అధికారంలో ఉండి తమపై చేసిన ఆరోపణలను రుజువు చేయకుండా గాడిదలు కాస్తున్నారా? అంటూ నిలదీసారు లోకేష్.
నాటి టీడీపీ ప్రభుత్వం పై ఈ వైసీపీ నాయకులు ఎన్నో ఆరోపణలు చేశారు కానీ ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేక పోయారు అంటూ తిరుమలలో వెంకన్న పింక్ డైమండ్ మిస్సింగ్ ఉదంతాన్ని ప్రస్తావించారు లోకేష్. అలాగే రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ అన్నారు., ఫైబర్ గ్రిడ్ లో ఏకంగా నా పైనే ఆరోపణలు చేసారు, పోలవరంలో నిధులు మాయం అంటూ అసత్యాలు ప్రచారం చేశారు, ఇప్పుడు తాజాగా ఈ పెగాసిస్ సాఫ్ట్ వేర్ అంటున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఎటువంటి చట్ట వ్యతిరేఖ పనులకు పాల్పడలేదని., రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకు ఆదేశాలిచ్చినా ఎదుర్కొంటామని కుండ బద్దలుకొట్టారు లోకేష్. ఈ విషయమై మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటరావు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ ప్రచారాలన్నీ అవాస్తవాలని ఈ చర్చల వలన ప్రజలు ఆందోళనకు గురి కాకూడదనే తన వంతు బాధ్యతగా వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలనుకున్నాని మీడియా ముఖంగా తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. ఇదంతా వైసీపీ ఆడే డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగమే అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు.



