మంగళగిరిలో వైసీపీకి “మంగళం” పాడిన కార్యకర్తలు!

Nara Lokesh TDP Mangalagiriఅధికార వైసీపీ పార్టీకి ఏపీ రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరారు. మంగళగిరి నియోజక పరిధిలోని దుగ్గిరాల, పెనుమాలి, పేరుకలపూడి గ్రామాలకు చెందిన పలువురు దళిత వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.

వైసీపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగానే పార్టీని వీడవలసి వస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి తీసుకున్న ఎన్నో నిర్ణయాలు తమను ఆవేదనకు గురిచేశాయని.., రాజధాని విషయంలో కూడా ఈ ప్రభుత్వం దళితులకు అన్యాయమే చేసిందని తమ ఆవేదనను లోకేష్ సమక్షంలో వెలువరించారు.

ADVERTISEMENT

జగన్ దళితులకు అండగా ఉంటానని ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నికల సమయంలో తమను నమ్మించారని., అయితే పార్టీ అధికారంలో వచ్చాక కనీసం తమ గోడును వినడానికి కూడా ఏ నాయకుడు కూడా అందుబాటులో లేరని వారి భాదను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ముద్దుగా పిలుచుకునే మంగళగిరి ఎమ్మెల్యే ‘కరకట్ట కమలహాసన్’ అలియాస్ ఆర్కే కూడా తమ ఆవేదనను అర్ధం చేసుకోకండా ప్రభుత్వనిర్ణయాలకు వంత పాడుతున్నారని…, వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని అధికార పార్టీ మీద విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో జగన్ బావ… “బ్రదర్ అనిల్” ఏపీలో పర్యటించినప్పుడు మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబులో ఆంతర్యం కూడా ఇదే అనేది టీడీపీ శ్రేణుల వాదన. ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడుతున్నారని వచ్చిన కథనాలను ఖండిస్తూ నేను ఆంధ్రప్రదేశ్ కు రావడానికి ముఖ్య కారణం ఇక్కడి క్రైస్తవులు ఎదురుకొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడానికే మాత్రమే అని సమాధానం చెప్పారు. అంటే ఇక్కడ ప్రభుత్వంలో దళితులు సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవమేగా అనేది తెలుగు తమ్ముళ్ల సూటి ప్రశ్న.

దళితులకు అండగా “నేనున్నాను” అంటూ జగన్ చేసిన ప్రచారాలు అన్ని వట్టి భూటకపు మాటలేనా..? అని ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. తమ పార్టీని నమ్మి చేరిన కార్యకర్తలను మనస్ఫూర్తిగా తెలుగుదేశం కుటుబంలోకి ఆహ్వానిస్తున్నట్లుగా లోకేష్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లోకేష్ తన సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పోస్ట్ చేశారు.

ADVERTISEMENT
Latest Stories