ట్రెండ్ సెట్ చేసిన లోకేష్..!

nara-lokesh-trend-setter

సినీ రంగంలో ఎక్కువగా వినిపించే ఈ ట్రెండ్ అనే పదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రెండ్ అవుతుంది. దీనికి కారణం టీడీపీ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్.

టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ వైసీపీ దౌర్జన్యాలను ఎదురుకుంటున్న సమయంలో ఆ పార్టీ క్యాడర్ కు, లీడర్లకు ఒక భరోసా అందించే క్రమంలో ‘రెడ్ బుక్’ అంటూ ఒక పుస్తకాన్ని రాజకీయ తెర మీదకు తెచ్చారు లోకేష్.

ADVERTISEMENT

వైసీపీ హయాంలో అప్రజాస్వామ్యంగా వ్యవహరించి టీడీపీ నేతలను హింసించిన ప్రతి ఒక్కరి పేరు ఈ రెడ్ బుక్ లో రాసుకుంటా, మా ఆపార్టీ అధికారంలోకి వచ్చాకా చట్టపరంగా వారి అంతు చూస్తా అంతు నాడు లోకేష్ చూపిన ఈ రెడ్ బుక్ నేడు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు మార్గదర్శకంగా మారింది.

అయితే నాడు లోకేష్ చెప్పిన ఈ రెడ్ బుక్ ను అంతగా పట్టించుకోకుండా హేళన చేసిన పార్టీలు, నాయకులు ఇప్పుడు ఈ బుక్ ల ట్రెండ్ ను ముందుకు తీసుకెళుతున్నారు. ఇందులో ప్రధమంగా లోకేష్ ని ఫాలో అయిన నేత వైసీపీ అధినేత వైస్ జగన్. లోకేష్ రెడ్ బుక్ ను ఫాలో అవుతూ జగన్ ‘గుడ్ బుక్’ ను సృష్టించారు.

ఇక వైసీపీ నుంచే అంబటి రాంబాబు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయడానికి ‘గ్రీన్ బుక్’ రాస్తున్నా అంటు మరో రంగు పుస్తకాన్ని ఏపీ రాజకీయాలలోకి విడుదల చేసారు. దీనితో గతంలో లోకేష్ రెడ్ బుక్ ని గేళి చేసిన నేతలంతా ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటు తమకు ఒక పుస్తకం ఉందంటూ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.

అయితే ఈ రంగుల పుస్తకాల ట్రెండ్ ఇక్కడితో ఆగితే ఇంకా వింతేముంది అనేలా టీడీపీ కి మరో రాజకీయ ప్రత్యర్థి అయినా బిఆర్ఎస్ పార్టీ కూడా లోకేష్ రెడ్ బుక్ ట్రెండ్ ను ఫాలో అవుతూ మా పార్టీ తరపున ఇక నుంచి ‘పింక్ బుక్’ మైంటైన్ చేస్తాం అంటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేసీఆర్ కుమార్తె కవిత.

దీనితో లోకేష్ ఈ బుక్ ల రాజకీయానికి ట్రెండ్ సెట్టర్ అయ్యారంటూ సోషల్ మీడియాలో రెడ్ బుక్ ట్రెండ్ అయ్యింది. ఇక ప్రాంతీయ పార్టీలే ఇలా రెడ్, గుడ్, గ్రీన్, పింక్ బుక్ లను సృష్టిస్తే జాతీయ పార్టీగా, కేంద్రంలో మూడోసారి అధికారాన్ని అందుకున్న బీజేపీ ఖాళీగా ఉంటుందా.?

తెలంగాణ బీజేపీ నేత ఈటెల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజల తరపున పని చెయ్యాల్సిన కొంతమంది అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఇది అప్రజాస్వామ్యం, ఇటువంటి అధికారుల పేర్లను నమోదు చేసుకోవడానికి బీజేపీ కూడా ఒక బుక్ రాస్తోందని దానికి ‘కాషాయ బుక్’ గా నామకరణం చేస్తామంటూ వ్యాఖ్యానించారు.

దీనితో ఈ బుక్ ల ట్రెండ్ ఇప్పుడు బీజేపీ ని కూడా తాకినట్టయింది. అయితే ఇలా ఎవరి పార్టీ నేతలు వారి పార్టీ రంగులతో బుక్ లను ప్రకటిస్తుంటే టీడీపీ మాత్రం తన పార్టీ రంగైన పసుపుని కాదని ఎరుపును ఎంచుకుని ‘రెడ్ బుక్’ ని రూపకల్పన చేసింది. ఈ విషయంలో కూడా లోకేష్ ఒకరకంగా ట్రెండ్ సెట్టరే అని చెప్పొచ్చు. మరి ఇక టి. కాంగ్రెస్, జనసేన పార్టీలు కూడా ఇతర పార్టీల మాదిరి తమ పార్టీ తరపున కూడా ఒక బుక్ ను ప్రకటిస్తారా.?

ADVERTISEMENT
Latest Stories