ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన వారితో పాటు, ప్రస్తుతం విధుల్లో ఉన్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగాయి. రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూసిన యువనేత నారా లోకేశ్ కి ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు.
ఆయా మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు…
నిమ్మకాయల చినరాజప్ప – హోం శాఖ
యనమల రామకృష్ణుడు – ఆర్థిక శాఖ, వాణిజ్యపన్నులు, శాసనసభ వ్యవహారాలు
అయ్యన్న పాత్రుడు – రోడ్లు, భవనాల శాఖ
కేఈ కృష్ణమూర్తి – రెవెన్యూ, స్టాంప్స్
కళావెంకట్రావు – విద్యుత్ శాఖ
అచ్చెన్నాయుడు – రవాణా, బీసీ సంక్షేమ, చేనేత శాఖలు
సుజయ కృష్ణ రంగారావు – గనుల శాఖ
గంటా శ్రీనివాసరావు – విద్యాశాఖ
పితాని – కార్మిక, ఉపాధికల్పన
జవహర్ – ఎక్సైజ్ శాఖ
నారాయణ – మున్సిపల్ శాఖ
కొల్లు రవీంద్ర – న్యాయశాఖ
శిద్ధా రాఘవరావు – అటవీశాఖ
అమర్ నాథ్ రెడ్డి – పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్
కాల్వ శ్రీనివాసులు – గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – వ్యవసాయం, ఉద్యానవన శాఖలు
పరిటాల సునీత – మహిళా శిశు సంక్షేమ శాఖ, సెర్ఫ్
ప్రత్తిపాటి పుల్లారావు – పౌరసరఫరాల శాఖ
కామినేని – వైద్యారోగ్య శాఖ
మాణిక్యాల రావు – దేవాదాయ శాఖ
దేవినేని ఉమా మహేశ్వరరావు – నీటి పారుదల శాఖ
ఆదినారాయణరెడ్డి – మార్కెటింగ్ గిడ్డంగులు
నక్కా ఆనంద్‌బాబు – ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ
భూమా అఖిలప్రియ – పర్యాటకశాఖ, తెలుగు భాషాభివృద్ధి
నారా లోకేశ్ – ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి
అయితే తెలంగాణలో పంచాయతీరాజ్, మున్సిపల్, ఐటీ శాఖలను కేసీఆర్ తనయుడు కేటీఆర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులే కావడంతో ఇద్దరి మధ్య పోలికలను గమనించడం విశ్లేషకుల వంతయ్యింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే కార్యనిర్వహణ కలిగిన మంత్రిగా పేరొందారు. పలు సమస్యలకు ట్విట్టర్ ద్వారానే పరిష్కారాలు సూచిస్తూ, నేరుగా ప్రజలతో అనుసంధానమై ఉన్నారు. అంతే కాకుండా దేనిపైనైనా అనర్ఘళంగా మాట్లాడగల సామర్థ్యం అతనికి పెట్టని కోట.
కేటీఆర్ మాదిరే మూడు శాఖల బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేష్ కూడా విజయవంతమవుతారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న లోకేష్… పలు కీలక నిర్ణయాలు తీసుకుని విజయవంతంగా అమలు చేశారని, అలాగే వివిధ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించిన లోకేష్ సమర్థుడని, రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధితో లోకేష్ ప్రజల మన్నలు చూరగొంటారని ఏపీలో వినిపిస్తుండగా… కేటీఆర్ కు పోటీ లేదని తెలంగాణాలో వినిపిస్తున్నాయి.



