వైసీపీకి ఇదే అంతిమ యాత్ర: నారా లోకేష్‌

Nara-Lokesh-challenge-Jagan

గత ఎన్నికలలో టిడిపి యువనేత నారా లోకేష్‌ని వైసీపిఎంతగా అవహేళన చేసిందో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. మరో వ్యక్తి అయితే ఆ అవహేళనలను భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. కానీ నారా లోకేష్‌ వాటి నుంచే పాఠాలు నేర్చుకొని ఇప్పుడు వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి, ఆ పార్టీ నేతలతో చెడుగుడు ఆడుకుంటున్నారు. మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు నారా లోకేష్‌కి కౌంటర్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారంటే ఆయన పొలిటికల్ ర్యాంగింగ్ ఏ స్థాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు.

నారా లోకేష్‌ శంఖారావం పాదయాత్రతో మళ్ళీ ప్రజల మద్యకు వచ్చారు. నేడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శంఖారావం సభలో నారా లోకేష్‌ సిఎం జగన్మోహన్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరూ కాదనలేరు.

ADVERTISEMENT

· కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే పోస్టర్స్ రాష్ట్రమంతా పెట్టించుకున్నారు. కానీ ఆయన తన మంత్రులను, ఎంపీ, ఎమ్మెల్యేలను నమ్మడం లేదు. వారు కూడా ఆయనను నమ్మడం లేదు. ఇక ప్రజలెందుకు నమ్ముతారు?

· సొంత చెల్లి వైఎస్ షర్మిల, బాబాయ్ కూతురు సునీతా రెడ్డి ఇద్దరూ కూడా అన్నని నమ్మడం లేదు.

· ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి తమకు అన్న వలన ప్రాణభయం ఉందని చెపుతున్నారు. అన్నను చూసి చెల్లెళ్లే భయపడుతుంటే, రాష్ట్రంలో ఆడవాళ్ళకు భయంవేయదా?

· ఇంట్లో ఆడవాళ్ళపైనే సొంత పార్టీ నేతల చేత విమర్శలు చేయిస్తున్న జగన్‌ రాష్ట్రంలో ఆడవాళ్ళని కాపాడుతారా?

· ఈ మద్య జగన్‌ తన ప్రసంగాలలో ‘నేను మీ బిడ్డని…’ అని నొక్కి చెపుతున్నారు. ఆయన మాట నమ్మి మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే, నేను మీ బిడ్డనే కదా అంటూ మీ ఆస్తిపాస్తులు గుంజుకుంటాడు.

· ఎన్నికలలో ఓడిపోతామని తెలిసినా జగన్‌ ప్రభుత్వం డీఎస్సీ జారీ చేసింది. అది వైసీపిని కాపాడుకునేందుకు చేస్తున్న చివరి ప్రయత్నం మాత్రమే. టిడిపి, జనసేనలు అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలండర్ విడుదల చేసి ఏటా డీఎస్సీ విడుదల చేస్తాము.

· కోట్లు ఖర్చుపెట్టి యాత్ర-2 సినిమా తీయిస్తే ఉచితంగా టికెట్లు ఇచ్చి చేతిలో డబ్బు పెడుతున్నా ఎవరూ సినిమా చూసేందుకు వెళ్ళడం లేదు. బహుశః ఇదే జగన్‌ ప్రభుత్వానికి అంతిమ యాత్ర కావచ్చు అంటూ టిడిపి యువనేత నారా లోకేష్‌ సెటైర్లు వేశారు.

ADVERTISEMENT
Latest Stories